రాజ్​భవన్​ సిబ్బందిలో 10 మందికి కరోనా

రాజ్​భవన్​ సిబ్బందిలో  10 మందికి కరోనా

హైదరాబాద్, వెలుగురాజ్​భవన్​లో పనిచేసే పది మంది సిబ్బందికి కరోనా పాజిటివ్​ వచ్చింది. వారి కుటుంబ సభ్యులు మరో పది మందికీ వైరస్​ సోకింది. ఆ 20 మందిని ఎర్రగడ్డలోని ఆయుర్వేదిక్​ హాస్పిటల్​ ఐసోలేషన్​ వార్డులో చేర్పించి ట్రీట్​మెంట్​ చేస్తున్నారు. శని, ఆదివారాల్లో రాజ్​భవన్​లో పనిచేసే మొత్తం 395 మంది పోలీసులకు టెస్ట్​ చేయగా 28 మందికి కరోనా పాజిటివ్​ వచ్చిందని రాజ్​భవన్​ అధికారులు వెల్లడించారు. దీంతో గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ కూడా టెస్టులు చేయించుకున్నారని, ఆమెకు నెగెటివ్​ వచ్చిందని తెలిపారు.

టెస్టులు చేయించుకోండి

కరోనా పేషెంట్లను కలిసిన వ్యక్తులు, రెడ్​జోన్లలో ఉండే ప్రజలు వీలైనంత తొందరగా కరోనా టెస్ట్​ చేయించుకోవాలని గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ సూచించారు. టెస్ట్​ చేయించుకునేలా ఇతరులనూ ప్రోత్సహించాలన్నారు. వెంటనే టెస్ట్​ చేయించుకుంటే తమను తాము కాపాడుకోవడంతో పాటు ఇతరులకు వైరస్​ సోకకుండా జాగ్రత్త పడొచ్చని అన్నారు. ఎలాంటి మొహమాటం లేకుండా టెస్ట్​ చేయించుకోవాలన్నారు. తాను కూడా కరోనా టెస్ట్​ చేయించుకున్నానని, నెగెటివ్​ వచ్చిందని ఆమె చెప్పారు. ‘టెస్ట్​.. ట్రేస్​.. ట్రీట్​.. టీచ్​’ అంటూ ఆదివారం ఆమె ట్వీట్​ చేశారు. ఇరుగుపొరుగతో ఇబ్బందులొస్తాయన్న భయంతో లక్షణాలున్న చాలా మంది టెస్టులు చేయించుకునేందుకు వెనకడుగు వేస్తున్నారు. దీంతో ఆమె చేసిన ట్వీట్​ ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇతర పద్ధతుల్లో ఆదాయంపై ఫోకస్

బస్సులు సరిగా నడవకపోవడంతో ప్రస్తుతం టికెటేతర ఆదాయం పెంచుకోవడంపైనే ఆర్టీసీ ఫోకస్​ పెట్టింది. ఇటీవల కార్గో, పార్సిల్ సర్వీసులను ప్రారంభించింది. వీటి ద్వారా ఏటా రూ. 200 కోట్లు టార్గెట్ గా పెట్టుకుంది. ఇక బస్ పాస్ కౌంటర్లను కూడా సొంతంగా నిర్వహించనుంది. ఇప్పటిదాకా దీన్ని ఔట్ సోర్సింగ్​కు ఇచ్చారు. పెట్రోల్ బంకులు కూడా ఔట్ సోర్సింగ్ వారే నడిపిస్తున్నారు. దీన్ని కూడా ఆర్టీసీనే నడపనుంది. అంతేకాకుండా ఆర్టీసీలో డ్రైవింగ్ స్కూళ్లు కూడా పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఆర్టీసీకి 2 నెలల్లో రూ.600 కోట్లు లాస్