రికవరీ రేటు 87.76%.. మరణాల రేటు 1.12 శాతం

రికవరీ రేటు 87.76%.. మరణాల రేటు 1.12 శాతం

దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నాయి. వరుసగా 6 రోజులుగా వైరస్ భాధితుల సంఖ్య మూడు లక్షల లోపే ఉంటోంది. భారత్ లో కొత్తగా 2 లక్షల 57 వేల 299 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్ తో 4 వేల 149 మంది చనిపోయారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,62,89,290 కి చేరగా మరణాల సంఖ్య 2,95,525 కు చేరింది. 

ఇదే టైంలో వైరస్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా రికార్డ్ స్థాయిలో పెరుగుతోంది. 24 గంటల్లో దేశంలో 3 లక్షల 57 వేల 630 మంది కోలుకున్నారు.  ప్రస్తుతం 29 లక్షల 23 వేల 400 మంది కి ట్రీట్మెంట్ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 87.76 శాతంగా ఉంది. మరణాల శాతం 1.12 గా ఉంది. దేశంలో ఇప్పటివరకు 19 కోట్ల 33 లక్షల 72 వేల 819 మందికి కరోనా టీకాలు వేసినట్టు ప్రకటించింది కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ.