ఇంటి దగ్గర్నే శాంపిల్ కలెక్షన్

ఇంటి దగ్గర్నే శాంపిల్ కలెక్షన్

సస్పెక్టర్స్ ను హాస్పిటళ్ల కు తీసుకెళ్లకుండానే టెస్టులు
ఇందుకోసం మొబైల్ వెహికల్స్
పాజిటివ్ వస్తే దవాఖానాకు.. వేగంగా టెస్టింగ్, క్వారంటైన్‌
రద్దీ తగ్గేందుకు నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: కరోనా అనుమానితుల టెస్ట్‌‌ శాంపిళ్లను వారి ఇంటి వద్దే సేకరించాలని సర్కారు నిర్ణయించింది. ఇందుకోసం హెల్త్ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా ఓ వాహనాన్ని తయారు చేయిస్తోంది. శాంపిళ్లను భద్రపర్చేందుకు అవసరమైన ఫ్రీజింగ్, ఇతర వసతులను దానిలో సమకూర్చుతున్నారు. తొలుత హైదరాబాద్‌‌లో ఈ మొబైల్ శాంపిల్‌‌ సేకరణ మొదలుపెట్టనున్నారు. కరోనా పాజిటివ్ వచ్చినోళ్ల కాంటాక్ట్స్, ఇతర అనుమానితుల ఇండ్ల దగ్గరికే వెళ్లి వారి నుంచి శాంపిల్స్‌‌సేకరిస్తారు. టెస్ట్ రిపోర్ట్ వచ్చేదాకా ఇంట్లోనే క్వారంటైన్ చేస్తారు. పాజిటివ్ వస్తే హాస్పిటల్ కు తరలిస్తారు. నెగిటివ్ వస్తే ఇంట్లోనే క్వారంటైన్ కొనసాగిస్తారు. దీనివల్ల తక్కువ టైమ్‌‌లో ఎక్కువ శాంపిల్స్ సేకరించొచ్చని.. ఎక్కువ మందిని క్వారంటైన్‌ ‌సెంటరకు, దవాఖానాలకు తరలించాల్సిన అవసరం ఉండదని అధికారులు చెప్తున్నారు.

మరెన్నో ఇబ్బందులు తప్పుతయి
ప్రస్తుతం కరోనా అనుమానితులను ఏదైనా హాస్పిటల్‌‌కు లేదా క్వారంటైన్‌‌కు సెంటర్‌‌కు తరలించి శాంపిల్స్‌‌ సేకరిస్తున్నారు. టెస్టుల రిజల్ట్స్ వచ్చేదాకా అక్కడే ఉంచుతున్నారు. నెగిటివ్ వస్తే తిరిగి ఇండ్లకు పంపి క్వారంటైన్లో ఉంచుతున్నారు. పాజిటివ్ వచ్చినోళ్లను గాంధీ హాస్పిటల్‌‌కు తరలిస్తున్నారు. అయితే సస్పెకర్స్ ను ఒకేచోట ఉంచడం వల్ల.. వారిలో ఎవరికైనా వైరస్ ఉంటే మిగతా వాళ్లకు సోకే ప్రమాదం ఉందన్నఆందోళనలు వ్యక్తమయ్యాయి. టెస్టుల రిపోర్టులు ఆలస్యమవుతున్న కొద్దీ హాస్పిటల్‌‌ ఐసోలేషన్‌‌ లో ఉన్న సస్పెక్టర్స్ అసహనానికి లోనవుతున్నారు. ఉస్మానియాలో డాక్టర్‌‌పై దాడి విషయంలో కూడా ఇలా అందరినీ ఒకే చోట ఉంచడమే కారణమైంది. ఇక హాస్పిటల్ ఐసోలేషన్ భయంతో మరికొందరు టెస్టులకు కూడా రావడం లేదు. ఈ విషయంగా కొందరు కరోనా సస్పెక్టర్లు సీఎంవోకు, మంత్రి కేటీఆర్‌‌కు ట్విట్టర్లో ఫిర్యాదులు కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే ఇంటి వద్ద శాంపిల్స్ సేకరించడం ద్వారా సమస్యలను అధిగమించొచ్చని హెల్త్ డిపార్ట్ మెంట్ అధికారులు నిర్ణయానికి వచ్చారు. కంటెయిన్‌‌మెంట్ జోన్లలో ఒకేసారి పెద్ద సంఖ్యలో శాంపిల్స్ సేకరించాల్సి వచ్చినా.. మొబైల్ కలెక్షన్ విధానం ఉపయోగకరంగా ఉంటుందని వారు అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కంటెయిన్‌‌మెంట్ జోన్లలో ఇంటింటి సర్వే చేస్తున్నారు. ఇప్పటివరకు 2,200 అనుమానితుల్ని గుర్తించారు. వారిని హాస్పిటళ్లకు తరలించి టెస్టులు చేయించారు. వారెవరికీ పాజిటివ్ రాలేదు. మొబైల్ కలెక్షన్ ద్వారా అయితే ఎవరినీ హాస్పిటళ్లకు తరలించాల్సిన అవసరం ఉండదని ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు.

For More News..

బయటపడుతున్న కరోనా లక్షణాల్లేని కేసులు

12 జిల్లాల్లో పూల్‌ టెస్టులు

దేశంలో నిన్న ఒక్కరోజే 33 మంది మృతి

లాక్డౌన్ పెంచడానికి కారణం అదే..