కరోనాతో ఊర్లు గావర.. పెరుగుతున్న కేసులు

కరోనాతో ఊర్లు గావర.. పెరుగుతున్న కేసులు

ఎక్కడికక్కడ పెరిగిపోతున్న పాజిటివ్​ కేసులు

మొదట్లో కట్టడి చేసిన పబ్లిక్ .. లీడర్ల టూర్లతో రిలాక్స్
మాస్కు లు, డిస్టెన్స్ మరిచి.. ఫంక్షన్లు, దావత్ లకు అటెండ్
ఆగస్టులో జీహెచ్ఎంసీ మినహా జిల్లాల్లోనే 80% కేసులు
ఇలాగైతే మున్ముందు కంట్రోల్ కష్టమే అంటున్న డాక్టర్లు

కరోనాతో ఊర్లు గావరైతున్నయ్. ఎక్కడికక్కడ పాజిటివ్​ కేసులు పెరిగిపోతున్నయ్. వైరస్​ వచ్చిన మొదట్ల రాస్తాలు మూసేసి, ముళ్లకంపలు అడ్డం పెట్టి తమను తాము కాపాడుకున్న ఊరోళ్లు.. కొద్దిరోజులుగా మాస్కులు, ఫిజికల్​ డిస్టెన్స్  మరిచి ఎప్పట్లాగే పండుగలు, పబ్బాలు, దావత్​లని తిరుగుతున్నరు. దుకాణాలు, హోటళ్ల కాడ.. పింఛన్లు, రేషన్​ ఇచ్చేకాడ.. కల్లు దుకాణాలు, పర్మిట్​రూంల కాడ.. ఎక్కడపడితే అక్కడ గుంపులు గుంపులుగా కనిపిస్తున్నరు. ఇంకేముంది? కరోనా ఊరితొవ్వ పట్టింది. చిన్నచిన్న పల్లెలపై కూడా తడాఖా చూపిస్తున్నది. 500 జనాభా మించని ఊళ్లలోనూ యాభైలు, వందలు అన్నట్లుగా కరోనా కేసులు వస్తున్నయ్.

జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలో కొత్తగా ఏర్పడ్డ వడ్డెర కాలనీ పంచాయతీలో 221 కుటుంబాలున్నాయి. ఈ ఊరిలో 40 మందికి కరోనా పాజిటివ్  రావడంతో ఊరోళ్లందరిలో టెన్షన్​ మొదలైంది. దీంతో అనుమానితులంతా టెస్టుల కోసం రాయికల్​ పీహెచ్​సీ ముందు ఇలా  క్యూ కట్టారు.

రాష్ట్రంలో పల్లెలను కరోనా చుట్టేస్తున్నది. కొన్నిఊర్లలో ఇంటికో పాజిటివ్ పేషెంట్ కనిపిస్తున్నారు. రోజూ ప్రభుత్వం ప్రకటించే కేసుల్లో ఎక్కువగా రూరల్ ఏరియాలోనే నమోదవుతున్నా యి. జులై చివరి వరకు ఎక్కువగా హైదరాబాద్, దాని చుట్టుపక్కల జిల్లాలు, జిల్లా కేంద్రాల్లోనే కేసులు వచ్చేవి. ఆగస్టు నుంచి పల్లెల్లోనూ బాగా పెరిగిపోతున్నాయి.

పట్నం నుంచి పల్లెకు.. 

మార్చి నుంచి జులై దాక జీహెచ్​ఎంసీ, జిల్లా కేంద్రాల్లో తప్ప ఊర్లలో వైరస్ ప్రభావం పెద్దగా కనిపించలేదు. ప్రారంభంలో కరోనా విషయంలో పల్లె జనం కూడా ఎక్కడా లేని చైతన్యం చూపారు. ఊరూరా బారీకేడ్లు, ముండ్ల కంచెలతో చెక్ పోస్టులు ఏర్పాటుచేసుకున్నారు. కొత్తవారెవరినీ ఊర్లెకు అడుగుపెట్టకుండా 24 గంటలూ నిఘా పెట్టారు. ఫారెన్ నుంచో, ఇతర రాష్ట్రాల నుంచో, హైదరాబాద్ నుంచో ఎవరైనా వస్తే వారిని వాళ్ల ఇండ్లలోనే క్వారంటైన్ చేసి, 21 రోజుల దాకా బయటికి రాకుండా చూశారు. దీంతో జులై దాకా ఊర్లలో పెద్దగా కేసులు నమోదు కాలేదు. కానీ ఆ తర్వాత సర్కారు నిర్లక్ష్యం ఫలితంగా జనం రిలాక్సయ్యారు. మొక్కలు, శ్మశానాలు, రైతువేదికలు, సమావేశాలు అంటూ లీడర్లు, ఆఫీసర్లు విచ్చలవిడిగా తిరగడంతో వాళ్లను చూసి పల్లె జనం బయటకు వచ్చారు. మాస్కులు, ఫిజికల్ డిస్టెన్స్ మరిచిపోయారు. చావులు, పెండ్లిళ్లు, ఫంక్షన్లు, దావత్ లు అంటూ తిరగడం మొదలుపెట్టారు. కిరాణ షాపులు, హోటళ్లు, కల్లు దుకాణాలు, వైన్స్ షాపులు, పర్మిట్ రూముల దగ్గర ఎప్పట్లాగే గుమిగూడుతున్నారు. పింఛన్ల కోసం, రేషన్ కోసం క్యూ కడుతున్నారు. దీంతో నెల రోజులుగా రూరల్ ఏరియా​లో కేసుల సంఖ్య పెరిగిపోతోంది. జీహెచ్‌ఎంసీ రికార్డును ఆగస్టులో జిల్లాలు తిరగరాశాయి. ఆగస్టు 1 నుంచి సెప ్టెంబర్ 3 వరకు స్టేట్ వైడ్ 71,098 కేసులు వస్తే.. అందు లో 57, 342 (80 శాతం) కేసులు జిల్లాల్లోనే రికార్డయ్యాయి. జులై చివరి వరకు చాలా రూరల్ జిల్లాల్లో పాజిటివ్ కేసులు పది శాతానికి మించి లేవు. కానీ ఆగస్టులో ఒక్కసా రిగా సీన్ మారిపోయింది. కొన్ని జిల్లాలైతే కేసుల పర్సంటేజీలో అర్బన్ జిల్లాలను దాటేశాయి. గడిచిన నెలలో జనగామ జిల్లాలో 2566 కేసులు నమోదైతే.. ఇందులో 60% కేసులు రూరల్ నుంచే వచ్చాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో నూ 56% కేసులు రూరల్ నుంచే ఉన్నాయి. నారాయణపేట జిల్లాలో 65%, గద్వాల జిల్లాలో 75% కేసులు, నల్గోండ, యాదాద్రి జిల్లాల్లో 60%, మెదక్ జిల్లాలో 62% కేసులు రూరల్ ఏరియావే.

మెడికల్ టీమ్స్​ పరేషాన్
ఊర్లలో కేసులు పెరుగుతుండడంతో మెడికల్ టీమ్స్ పరేషాన్ అవుతున్నారు. అసలే స్టాఫ్ కొరత ఉండడంతో మారుమూల పల్లెలపై ఫోకస్ పెట్టలేకపోతున్నారు. పాజిటివ్ వచ్చినవారికి మందులు ఇచ్చి, హోం ఐసోలేషన్ లో ఉండాలని చెప్పి పంపిస్తున్నారు. కానీ చాలామంది బయట తిరుగుతున్నారు. సెపరేట్‌ ‌బెడ్‌‌రూం లు, బాత్రూమ్‌‌ల వంటి ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల ఊర్లలో హోం ఐసోలేషన్ సాధ్యం కావడం లేదని డాక్టర్లు చెబుతున్నారు. అందువల్ల సర్పం చులు, గ్రామ కార్యదర్శులు ప్రజలకు అవగాహన కల్పించాలని, వ్యాక్సిన్ వచ్చేదాక పండుగలు, ఫంక్షన్లు, దావత్ లు పక్కనపెట్టేలా చూడాలని వారు సూచిస్తున్నారు.

కొన్ని ఊర్లలో కేసుల తీరిది..!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ము గూడెం మండలంలోని అటవీప్రాంతంలో చిలకదంతెనం అనే చిన్న గ్రామం ఉంది. ఇక్కడ 290 మంది ఉండగా, అందు లో 41 మందికి కరోనా సోకింది. ఓ మత పెద్ద ఇంట్లో పార్టీకి వెళ్లడం వల్లే పాజిటివ్ వచ్చినట్లు తేలింది.
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కేశవాపురంలో సుమారు 130 కుటుంబాల్లో ఏకంగా 50 కేసులు నమోదయ్యాయి.
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని వెంకటేశ్వర్ల పల్లె గ్రామ పంచాయతీ హామ్లెట్ అయిన గోవిందాపూర్ లో కేవలం 300 జనాభా ఉండగా.. ఏకంగా 84 మందికి కరోనా సోకింది.
జనగామ జిల్లా బచ్చన్న పేట మండలం ఆ లింపుర్ గ్రామంలో1500 జనాభా ఉండగా.. 82 పాజిటివ్ కేసులు వచ్చాయి.
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్‌‌ లో 82 కరోనా పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి.
వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం పంగి డిపల్లిలో 1,374 మంది జనాభా ఉండగా ఇప్పటి వరకు 76 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. ఇదే మండలం వెంకటేశ్వర-్లపల్లిలోని ఎనిమిది కుటుంబాల్లో ఏకంగా 20 మందికి కరోనా అంటుకుంది.
కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం పచ్చునూరులో సుమారు వెయ్యి మంది జనాభా ఉండగా.. 100 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.

400 ఫ్యామిలీలు.. 113 కేసులు

ఇది ములుగు జిల్లా వెంకటాపురం మండలం వీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే పురం గ్రామం. ఆగస్టు 25 వరకు ఈ ఊరిలో ఒక్క కరోనా కేసు కూడా లేదు. ఇప్పుడు ఇంటింటా కరోనా పేషెంట్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌కనిపిస్తున్నారు. ఊరిలో మొత్తం 400 కుటుంబాలు ఉంటే.. ఏకంగా113 కరోనా కేసులు నమోదయ్యాయి. ఊరిలో జరిగిన ఓ ఫంక్షన్​కు ఊరోళ్లంతా వెళ్లడంతో 10 రోజుల్లోనే వైరస్​ చుట్టుముట్టింది. కేసులు పెరుగుతుండడంతో ఎలా కంట్రోల్​ చేయాలో తెలియక హెల్త్​ ఆఫీసర్లు పరేషాన్​ అవుతున్నారు.

For More News..

రష్యా వ్యాక్సిన్ సేఫ్

పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన సోనూసూద్