
స్మార్ట్ బ్యాండ్.. స్మార్ట్ వాచ్లానే హార్ట్ బీట్ రేట్, బీపీ, వాకింగ్ స్టెప్స్ వంటివన్నీ అప్డేట్ చేస్తూ ఉంటుంది. అయితే, దీనికి స్మార్ట్వాచ్లా డిస్ప్లే ఉండదు. కాబట్టి నిద్రపోయేటప్పుడు కూడా పెట్టుకునే ఉండొచ్చు. తేలికగా ఉంటుంది. కాబట్టి రోజంతా పెట్టుకోవచ్చు. ఇది రోజంతా మనం చేసే యాక్టివిటీలను ట్రాక్ చేసి పూర్తి హెల్త్ అప్డేట్ను వివరణాత్మకంగా అందిస్తుంది.
వ్యాయామం చేసేటప్పుడు ఏవైనా తేడాలు కనిపిస్తే వెంటనే అప్డేట్ ఇస్తుంది. తద్వారా డాక్టర్ని సంప్రదించాలని మనకు అర్థమవుతుంది. ఇందులోని బయోచార్జ్ స్కోర్ బాడీ రెస్ట్గా ఉందా లేదా కొలుస్తుంది. ఎంత సేపు నిద్రపోయాము ? నిద్ర బాగానే పట్టిందా? లేదా? వంటివి ట్రాక్ చేస్తుంది. నిద్రలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే గుర్తిస్తుంది. స్లీప్ ఆప్నియా ఉన్నవాళ్లకు ఇది చాలా బాగా పనిచేస్తుంది.