మెదక్ జిల్లాకు కరోనా టెన్షన్.. బాలింతకు సోకిన మహమ్మారి   

మెదక్ జిల్లాకు కరోనా టెన్షన్.. బాలింతకు సోకిన మహమ్మారి   
  •     రెండు రోజుల్లో 12 మందికి  పాజిటివ్​
  •     ఎంసీహెచ్​లో మరికొందరికి వైరస్​ సోకిందనే అనుమానాలు  

మెదక్​ టౌన్​, వెలుగు : మెదక్​ జిల్లా వ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొద్దిరోజుల క్రితం వరకు ఒకరిద్దరికి మాత్రమే వైరస్​సోకగా, ఇప్పుడు  ఈ సంఖ్య పెరుగుతోంది. సోమవారం ఏడుగురికి,  మంగళవారం ఐదుగురికి పాజిటివ్​ వచ్చినట్టు వైద్యారోగ్య శాఖ సిబ్బంది తెలిపారు. ఇందులో మెదక్ టౌన్​కు చెందిన ఇద్దరు, హవేళీ ఘనపూర్​ మండలంలో మరో ఇద్దరు, కొల్చారం మండలానికి చెందిన ఒకరు ఉన్నారు.

కేసులు పెరుగుతున్న దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని మెదక్​ డీఎంహెచ్​ఓ డాక్టర్​ చందూనాయక్​ సూచించారు. మెదక్ మాతా, శిశు సంరక్షణ కేంద్రం (ఎంసీహెచ్​)లో ఇటీవల బిడ్డకు జన్మనిచ్చిన ఓ బాలింతకు  పాజిటివ్​ రాగా, ఈమెకు ప్రత్యేకంగా చికిత్స అందజేస్తున్నట్టు చెప్పారు. అలాగే మరికొందరు బాలింతలు, గర్భిణులకు సైతం కరోనా సోకినట్టు తెలుస్తోంది.