ఇంట్లో కరోనా టెస్టు.. ఇట్ల చేసుకోవాలె

ఇంట్లో కరోనా టెస్టు.. ఇట్ల చేసుకోవాలె

న్యూఢిల్లీ: మైలాబ్​కు చెందిన కొవిసెల్ఫ్​ కరోనా కిట్​కు అనుమతిచ్చిన నేపథ్యంలో ఇంట్లోనే ఉండి కరోనా టెస్టు ఎలా చేసుకోవాలో ఐసీఎంఆర్​  గైడ్​లైన్స్​ విడుదల చేసింది. కరోనా సోకిన వ్యక్తులను కలిసినోళ్లు లేదా లక్షణాలున్న వాళ్లే టెస్టు చేసుకోవాలని చెప్పింది. ర్యాపిడ్ టెస్ట్‌‌‌‌లో పాజిటివ్‌‌‌‌ వస్తే 100% పాజిటివ్‌‌‌‌గానే భావించాలని, మరోసారి టెస్టు చేయించుకోవాల్సిన అవసరంలేదని చెప్పింది. అలాంటి వాళ్లంతా ఐసోలేషన్‌‌‌‌లో ఉండాలంది. లక్షణాలున్నా నెగెటివ్​ వస్తే ఆర్టీపీసీఆర్ టెస్టు చేయించుకోవాలని చెప్పింది. మరో వారంలో కిట్ మార్కెట్‌‌‌‌లోకి రానుందని, ధర రూ. 250గా నిర్ణయించామని మైలాబ్ స్పష్టం చెసింది. 
టెస్టు ఎట్ల చేస్కోవాలంటే..
ప్రతి కిట్​లో నాసల్​ స్వాబ్​, టెస్టింగ్​ కార్డు, బయో హజార్డ్ బ్యాగ్, ముందే నింపిన ఎక్స్​ట్రాక్షన్​ ట్యూబ్​ వస్తాయి. మైలాబ్​ కొవిసెల్ఫ్​ యాప్​ డౌన్​లోడ్​ చేసుకోవాలి. యాప్​లో వివరాలు నమోదు చేశాక కిట్​లోంచి టెస్టింగ్​ కార్డ్​పై ఉన్న క్యూ ఆర్​ కోడ్​ను మొబైల్​తో స్కాన్​ చేయాలి. ముందే నింపిన ఎక్స్​ట్రాక్షన్​ ట్యూబ్​ను తీసి దాన్ని నిలువుగా పట్టుకోవాలి. అందులోని ద్రవం అంతా అడుగున చేరేవరకు వెయిట్​ చేయాలి. ట్యూబ్ ​నుంచి నాసల్​ స్వాబ్​ను తీసుకోవాలి. ముక్కులోని ఓ రంధ్రంలో చివరి వరకూ పెట్టుకొని చుట్టూ తిప్పాలి. అదే నాసల్​ స్వాబ్​తో ఇంకో రంధ్రంలో ఇలాగే చేయాలి. ఎక్స్​ట్రాక్షన్​ ట్యూబ్​మూత తీసి నాసల్​ స్వాబ్​(తల మొత్తం మునిగేలా) అందులో పెట్టాలి. ట్యూబ్​లో పెట్టేటప్పుడు స్వాబ్​ తలను ముట్టుకోకూడదు. ​

ట్యూబ్​ను పట్టుకొని స్వాబ్​ను ద్రవంలో 10సార్లు తిప్పాలి. స్వాబ్​ హెడ్​ను చూసి విరిచేయాలి. ట్యూబ్​ను మూతతో సీల్​ చేయాలి. ట్యూబ్​ను టెస్టింగ్​కార్డుపై సెట్​ చేసి రెండు డ్రాప్స్​ మిక్షర్​ను టెస్టింగ్​ పరికరంపై వేయాలి. 15 నుంచి 20 నిమిషాలు వెయిట్​ చేయాలి. తర్వాత టెస్టింగ్​ కార్డ్​ను ఫొటో తీసి యాప్​లో అప్​లోడ్​ చేయాలి. రిజల్ట్​ పాజిటివ్​ వస్తే క్వాలిటీ కంట్రోల్​ లైన్​, టెస్ట్​ లైన్​ రెండూ కార్డుపై కనిపిస్తాయి. నెగెటివ్ వస్తే క్వాలిటీ కంట్రోల్​ లైన్​ మాత్రమే కనబడుతుంది. అది  కనబడకపోయినా, టెస్టు లైన్​ కనబడినా పరీక్ష సరిగా చేయనట్లే. పరీక్ష పూర్తయ్యాక వాడిన వాటిన్నింటినీ బయో హజార్డ్​ బ్యాగ్​లో పెట్టాలి. సేఫ్​గా డిస్పోజ్​ చేయాలి.