చైనాలో చేపలకు, పీతలకు కరోనా టెస్టులు

చైనాలో చేపలకు, పీతలకు కరోనా టెస్టులు

చైనాలో కరోనా మరోసారి విజృంభిస్తోంది. రోజు రోజుకు కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనాను కంట్రోల్ చేసేందుకు ప్రతీ రోజు టెస్టులు చేస్తోంది. కరోనా కేసుల నమోదును అడ్డుకునేందుకు చైనా ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా చైనా తీర ప్రాంతనగరం జియామెన్ లో మత్య్సకారులకు కరోనా టెస్టులు నిర్వహిస్తోంది. అటు మత్స్యకారులతో పాటు చేపలు, పీతలు, ఇతర జంతువులకు ఆ దేశం కొవిడ్ టెస్టులు నిర్వహించడం గమనార్హం. 

చేపలు, పీతల నుంచి నమూనాల సేకరణ..
జియామెన్ లో ఆగస్టు మొదటి వారంలోనే 10వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. జియామెన్‌లో కొవిడ్ కేసులు రోజు రోజుకు పెరుగుతుండంతో స్థానిక అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలతో పాటు..మత్స్యకారులకు కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు. జిరో  కొవిడ్ లక్ష్యంతో అధికారులు ఒక్క అడుగు ముందుకేసి చేపలు, పీతలకు కూడా కరోనా చేయాలని అదేశించారు. దీంతో ఆరోగ్య సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి మత్య్సకారులతో పాటు సముద్రంలో వేటాడి తెచ్చిన చేపలు, పీతలకు కరోనా పరీక్షలు చేస్తున్నారు. వాటి నుంచి నమూనాలు సేకరిస్తున్నారు. 

దశాబ్దపు వింత..
చేపలు, పీతలకు కరోనా టెస్టులు నిర్వహిస్తున్న  వీడియోను సౌత్‌ చైనా మార్కింగ్‌ పోస్ట్‌ అనే యూజర్ పేరుతో సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఈ వీడియో  వైరల్‌ అయింది. మిలియన్ల కొద్ది ఈ వీడియోను చూశారు. లక్షల కొంది కామెంట్స్ చేశారు. కొందరు ఫన్నీ కమెంట్స్ పెడితే..మరికొందరు దశాబ్ధపు వింత అని అన్నారు. 

హిప్పోకు కూడా టెస్టులు
చేపలు, పీతలకే కాదు..చైనాలో హిప్పోకు కూడా కరోనా టెస్టులు నిర్వహించారు. గత మేలో కేసులు పెరిగిన సమయంలో..తూర్పు జెజియాంగ్‌లోని హుజౌలోని వైల్డ్‌లైఫ్ పార్క్‌లో హిప్పోకు కరోనా టెస్టులు చేశారు. వారానికి రెండు సార్లు కొవిడ్ టెస్టులు చేయడం గమనార్హం. 

చేపలకు కరోనా టెస్టులు ఎందుకంటే..
సముద్రంలో చేపల వేటకు వెళ్లే చైనా మత్స్యాకారులు ఇల్లీగల్ ట్రేడర్స్‌తో సంబంధాలు పెట్టుకుంటున్నారు. వారి వల్ల దేశంలోకి వైరస్ ప్రవేశించే అవకాశం ఉందని చైనా మీడియా చాలా కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తోంది. సముద్రజీవులకు కూడా కరోనా వైరస్ తో లింకులు ఉండవచ్చని కథనాలు రాసింది. దీంతో అధికారులు మత్స్యకారులు, వారు పట్టిన సముద్ర జీవులకు కరోనా టెస్టులు చేస్తున్నారు.  ఐతే జంతువుల నుంచి సేకరించిన నమూనాల్లో ఒక్కటి కూడా పాజిటివ్‌ కేసు నమోదుకాకపోవడం గమనార్హం.