వచ్చే నెల పీక్ స్టేజీకి కరోనా : 100 రోజులుండొచ్చట..!

వచ్చే నెల పీక్ స్టేజీకి కరోనా : 100 రోజులుండొచ్చట..!

ఫిబ్రవరి 15నే స్టార్టయింది..ఇంకా 100 రోజులు ఉండొచ్చు
లాక్ డౌన్లు, ఆంక్షలతో లాభం లేదు.. స్పీడ్ గా వ్యాక్సిన్లు వేయాలి
25 లక్షల కొత్త కేసులు నమోదు కావచ్చు: ఎస్​బీఐ రిపోర్ట్ 

న్యూఢిల్లీ: పోయిన నెల నుంచీ కరోనా మహమ్మారి మళ్లీ మోపైంది. రోజురోజుకూ కేసులు పెరుగుతున్నయి. డైలీ కేసులు మళ్లీ50 వేలకు చేరినయి. పరిస్థితిని చూస్తే.. ఇప్పటికే సెకండ్ వేవ్ వచ్చేసిందనేందుకు స్పష్టమైన సూచనలు కన్పిస్తున్నయని నిపుణులు చెప్తున్నరు. అయితే ఈ సెకండ్ వేవ్ కరోనా100 రోజులు కొనసాగే అవకాశం ఉందని స్టేట్ బ్యాంక్ ఆఫ్​ఇండియా (ఎస్ బీఐ) విడుదల చేసిన తాజా రిపోర్ట్ స్పష్టం చేసింది. దేశంలో కరోనా వ్యాప్తి, ఎకనమిక్ ఇంపాక్ట్ పై ఎస్ బీఐ చీఫ్​ఎకనమిక్ అడ్వైజర్ సౌమ్య కాంతి ఘోష్ ఆధ్వర్యంలోని రీసెర్చ్ టీం ఈ రిపోర్ట్ ను సిద్ధం చేసింది. ఫిబ్రవరి15 నుంచి మార్చి 23 వరకు నమోదైన కేసులను బట్టి చూస్తే.. సెకండ్ వేవ్ లో దేశవ్యాప్తంగా 25 లక్షల కొత్త కేసులు నమోదు కావచ్చని రిపోర్ట్ లో అంచనా వేశారు. పోయిన నెల 15 నుంచి సెకండ్ వేవ్ మొదలైనట్లేనని 28 పేజీల ఈ రిపోర్ట్ లో పేర్కొన్నారు.  
టీకాలతోనే గెలుపు 
కరోనా సెకండ్ వేవ్ ను అడ్డుకునేందుకు లోకల్ లాక్ డౌన్లు, ఆంక్షలు పెట్టడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని రిపోర్ట్ తెలిపింది. కరోనా విపత్తును జయించాలంటే మాస్ వ్యాక్సినేషనే మార్గమని అభిప్రాయపడింది. ఫస్ట్ వేవ్ కరోనా వ్యాప్తిలో డైలీ కేసులు, ప్రస్తుత ట్రెండ్ ను పోల్చి చూస్తే.. సెకండ్ వేవ్ కరోనా వ్యాప్తి వచ్చే నెల తర్వాత పీక్ స్టేజీలోకి వెళ్లొచ్చని రిపోర్టులో పేర్కొన్నారు. గత వారం రోజుల్లోనే బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ పడిపోయిందని, లోకల్ లాక్ డౌన్లు, ఆయా రాష్ట్రాలు పెట్టే ఆంక్షల ఎఫెక్ట్ ఎలా ఉంటుందన్నది వచ్చే నెలలో క్లియర్ గా తెలుస్తుందని తెలిపారు. 
రోజూ 45 లక్షల టీకాలేయాలె 
ప్రస్తుతం దేశవ్యాప్తంగా రోజూ 34 లక్షల వ్యాక్సిన్ లు వేస్తున్నారు. కానీ కరోనాను అడ్డుకోవాలంటే ఇవి చాలవని, వ్యాక్సినేషన్ స్పీడ్ ను పెంచాలని రిపోర్ట్ సూచించింది. దేశవ్యాప్తంగా రోజూ 40 లక్షల నుంచి 45 లక్షల వరకూ వ్యాక్సిన్ లు వేయాలని తెలిపింది. ఇలా చేస్తేనే 45 ఏండ్లకు పైబడిన పౌరులందరికీ నాలుగు నెలల్లో వ్యాక్సినేషన్ పూర్తవుతుందని వివరించింది.