ఏపీలో ఇవాళ 11,573 కేసులు.. మరణాలు 3
V6 Velugu Posted on Jan 29, 2022
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. తాజాగా ఇవాళ 11,573 కొత్త కేసులతోపాటు 3 మరణాలు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 40 వేల 357 మందికి పరీక్షలు చేయగా 11,573 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. అలాగే కరోనా సోకి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో చిత్తూరు, గుంటూరు, విశాఖపట్టణం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ముగ్గురు మృతి చెందినట్లు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. కొత్త కేసుల్లో అత్యధికంగా కడప జిల్లాలో 1942 కేసులు అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 247 కేసులు నమోదు అయ్యాయి. జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలు కింది పట్టికలో చూడండి.,,
ఇవి కూడా చదవండి
ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత ఆష్లే బార్టీ
పెగాసస్ పై న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం
ఫిబ్రవరి 1నుంచి స్కూళ్లు రీఓపెన్!
Tagged AP, Amaravati, cases, Andhra Pradesh, corona, deaths, COVID19, Positive, register