కరోనాకు అద్భుతంగా పనిచేస్తున్న మోడెర్నా వ్యాక్సిన్..  ఓవరాల్ సక్సెస్ రేట్ 94.1%

కరోనాకు అద్భుతంగా పనిచేస్తున్న మోడెర్నా వ్యాక్సిన్..  ఓవరాల్ సక్సెస్ రేట్ 94.1%

కరోనా సీరియస్ కాకుండా.. నూరు శాతం అడ్డుకుంటది

30 వేల మందిపై ఫేజ్-3 ట్రయల్స్.. సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవ్

అమెరికా, యూరప్ లో ఎమర్జెన్సీ అప్రూవల్ కు కంపెనీ అప్లికేషన్ 

కరోనా పేషెంట్​కు సీరియస్​ కాకుండా తమ వ్యాక్సిన్ నూరుశాతం అడ్డుకుంటుందని అమెరికన్ బయోటెక్నాలజీ కంపెనీ మోడెర్నా ప్రకటించింది. ఓవరాల్ గా తమ వ్యాక్సిన్  94.1% ఎఫెక్టివ్ గా పని చేసిందని తెలిపింది.  30 వేల మందిపై ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ నిర్వహించామని.. 100% శాతం మందికి కరోనా సీరియస్ కాకుండా తమ వ్యాక్సిన్ అడ్డుకుందని వెల్లడించింది. అమెరికా, యూరప్ లో ఎమర్జెన్సీ వినియోగం కోసం అనుమతి ఇవ్వాలని కోరుతూ అప్లై చేసుకుంటున్నట్లు చెప్పింది.

వాషింగ్టన్:  కరోనా సోకినా.. నూటికి నూరు శాతం డిసీజ్ సీరియస్ కాకుండా తమ వ్యాక్సిన్ అడ్డుకుంటుందని అమెరికన్ బయోటెక్నాలజీ కంపెనీ మోడెర్నా ప్రకటించింది. తమ వ్యాక్సిన్ కరోనా నివారణలో 94.1% ఎఫెక్టివ్‌గా పని చేసిందని వెల్లడించింది. అమెరికా, యూరప్‌లో తమ వ్యాక్సిన్ ఎమర్జెన్సీ వినియోగానికి అనుమతివ్వాలని కోరుతూ సోమవారం అప్లై చేసుకుంటున్నట్లు ఆ కంపెనీ వెల్లడించింది. 30 వేల మందిపై ఫేజ్–3 క్లినికల్ ట్రయల్స్ నిర్వహించామని.. 100% మందికి కరోనా సీరియస్ కాకుండా తమ వ్యాక్సిన్ అడ్డుకుందని తెలిపింది. మొత్తంగా 94.1 శాతం సక్సెస్ రేట్ నమోదు చేసిందని, వ్యాక్సిన్ వల్ల ఎలాంటి సీరియస్ ఆరోగ్య సమస్యలు రాలేదని, ఇంజక్షన్ వేసిన చోట కొంత నొప్పి, తలనొప్పి, అలసట వంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించాయని తెలిపింది. అమెరికాలో ఎమర్జెన్సీ వినియోగం కోసం యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ డీఏ)కు, యూరప్ లో మార్కెటింగ్ చేయడం కోసం యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీకి అప్లై చేసుకుంటున్నట్లు చెప్పింది. ఈ వ్యాక్సిన్ కు అనుమతిపై డిసెంబర్ 17న ఎఫ్ డీఏ సమావేశమై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం అందినట్లు వెల్లడించింది.

ఏడాది చివరికి 2 కోట్ల డోసులు..

కరోనా సోకినా అది తీవ్రం కాకుండా అడ్డుకోవడం, ఓవరాల్ గా వ్యాక్సిన్ సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్నందున కరోనా నివారణలో తమ వ్యాక్సిన్ కీలకం కానుందని మోడెర్నా కంపెనీ సీఈవో స్టెఫానె బాన్సెల్ చెప్పారు. ‘‘కరోనా నివారణకు మేం తయారు చేస్తున్న ‘ఎంఆర్ఎన్ఏ1273’ వ్యాక్సిన్ సీరియస్ కేసులను నివారిస్తుంది. వైరస్ బారిన పడినవారు దవాఖాన్లలో చేరాల్సిన అవసరం, చనిపోయే ప్రమాదం తగ్గుతాయి” అని బాన్సెల్‌ తెలిపారు. ఈ ఏడాది చివరికి 2 కోట్ల వ్యాక్సిన్ డోసులను తయారు చేస్తామని, ప్రతి ఒక్కరికీ రెండు డోసులు ఇవ్వాల్సి ఉన్నందున ఇవి కోటి మందికి సరిపోతాయని చెప్పారు. వచ్చే ఏడాది ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల నుంచి 100 కోట్ల డోసుల వరకూ తయారు చేస్తామన్నారు. కాగా, ఫైజర్, బయాన్ టెక్ కంపెనీలు కూడా వ్యాక్సిన్ లను ఆర్ఎన్ఏ టెక్నాలజీ ఆధారంగా డెవలప్ చేస్తున్నాయి. అవి కూడా 95% ఎఫెక్టివ్ గా పని చేశాయని ఆ కంపెనీలు ఇదివరకే వెల్లడించాయి.