గాలిలో కరోనా.. కంట్రోల్ చేయడం కష్టమవుతోంది

గాలిలో కరోనా.. కంట్రోల్ చేయడం కష్టమవుతోంది

హైదరాబాద్: ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్ గాలిలో కూడా ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గాలిలో ఉన్నందున కరోనాను కంట్రోల్ చేయడం చాలా కష్టమని మీడియా చిట్‌‌చాట్‌‌లో తలసాని పేర్కొన్నారు. మహారాష్ట్ర, ఢిల్లీలో మాదిరి మన దగ్గర పరిస్థితి తీవ్రంగా ఏమీ లేదని స్పష్టం చేశారు. ‘గాలిలో కూడా కరోనా వైరస్ ఉంది. అందుకే కంట్రోల్ చేయడం కష్టం అవుతోంది. మానవతా దృక్పథంతో ప్రైవేట్ హాస్పిటల్‌‌లు ఆలోచన చేయాలి. రోగులను పట్టిపీడించొద్దు. దేశం అంతటా ఎలక్షన్‌‌లు జరుగుతున్నాయి. మన రాష్ట్రంలో కొన్ని మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు జరిగితే తప్పేంటి?  ఆయుష్మాన్ భారత్‌‌లో ఏముంది? ఏమీ లేదు. జనాల ఇంట్రెస్ట్ బట్టి ఎవరు ఏ హాస్పిటల్ లో జాయిన్ కావాలో అందులో జాయిన్ అవుతారు’ అని తలసాని పేర్కొన్నారు.