ప్రపంచ వ్యాప్తంగా 5 లక్షల మంది డిశ్చార్జ్

ప్రపంచ వ్యాప్తంగా 5 లక్షల మంది డిశ్చార్జ్

న్యూఢిల్లీ: చైనాలో మొదలైన కరోనా మహమ్మారి.. మొత్తం ప్రపంచానికి విస్తరించి మారణహోమం సృష్టిస్తోంది. యూరప్, అమెరికాలో రోజూ వేలాది మంది జనం చనిపోతున్నారు. ఇండియాలో కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే13 వేలు దాటింది. 446 మంది చనిపోయారు. సుమారు 10 వేల మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 21 లక్షల కేసులు నమోదు కాగా.. 1,42,716 మంది చనిపోయారు. అయితే కరోనా సోకిన వారిలో 5.47లక్షల మంది కోలుకోవడం కాస్త ఊరటనిచ్చే అంశం. ప్రపంచంలో ప్రతి నలుగురు కరోనా రోగుల్లో ఒకరు కోలుకుంటున్నారు. ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అవుతున్నారు. ప్రతి 15 మందిలో ఒకరు చనిపోతున్నారు.

డెత్ రేట్3 నుంచి 4 శాతం

ప్రపంచవ్యాప్తంగా కరోనా సోకిన వ్యక్తుల్లో 95 శాతం మంది రికవర్ అవుతారని ఎక్స్​పర్టులు అంచనా వేస్తున్నారు. అయితే డెత్ రేట్ మాత్రం దేశానికి దేశానికి మధ్య తేడా ఉందని చెబుతున్నారు. కేవలం 3 నుంచి 4 శాతం మంది చనిపోతున్నారని అంటున్నారు.

కేరళలో 56 శాతం మంది రికవర్

దేశంలో తొలి కరోనా కేసు కేరళలోనే నమోదైంది. కానీ ఇప్పుడు కేరళ కంటే చాలా రాష్ర్టాల్లో పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఓవైపు వ్యాప్తిని అడ్డుకుంటూనే.. మరోవైపు వైరస్ సోకిన వారిని కాపాడుతున్నారు. అక్కడ 394 కేసులు నమోదైతే.. 218 మంది డిశ్చార్జ్ అయ్యారు. అంటే అక్కడ రికవరీ రేట్ 56 శాతం ఉంది. ఇది దేశంలోనే అత్యధికం. మహారాష్ర్టలో 10 శాతం, తమిళనాడులో 9.5 శాతం, ఢిల్లీలో 2.5 శాతం రికవరీ రేట్ ఉంది.