తమిళనాడులో 2 లక్షలు దాటిన కరోనా కేసులు

తమిళనాడులో 2 లక్షలు దాటిన కరోనా కేసులు

తమిళనాడులో కరోనా వైరస్ విలయతాండం చేస్తోంది. రాష్ట్రంలో ఇవాళ్టి వరకు కరోనా కేసులు 2 లక్షలు దాటిపోగా, ఈ మహమ్మారికి ఇప్పటికే దాదాపు 3,400 మందికి పైగా బలయ్యారు. గడిచిన 24 గంటల్లో 64,315 శాంపిల్స్ టెస్ట్ చేయగా.. 6,988 మందికి పాజిటివ్ వచ్చిందని తమిళనాడు ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 2,06,737కి చేరింది. ఈ ఒక్క రోజులో 89 మరణించగా.. మొత్తం కరోనా మరణాల సంఖ్య 3,409కి చేరింది. భారీగా కొత్త  కేసులు నమోదవుతున్నప్పటికీ రాష్ట్రంలో రికవరీ రేటు మెరుగుగా ఉండడం ఆశాజనకంగా కనిపింస్తోంది. గడిచిన 24 గంటల్లో 7,758 కోలుకుని డిశ్చార్జ్ కావడంతో ఇప్పటి వరకు కరోనా మహమ్మారిని జయించిన వారి సంఖ్య 1,51,055కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 52,273 మంది చికిత్స పొందుతున్నారు.

తమిళనాడులో నమోదైన మొత్తం కరోనా కేసుల్లో ఒక్క చెన్నై నగరంలోనే దాదాపు సగం ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 1329 మందికి పాజిటివ్ రాగా, ఇప్పటి వరకు సిటీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 93,537కి చేరింది. చెన్నైలో కరోనా మరణాల సంఖ్య 1989గా ఉంది.