రాష్ట్రంలో 15 వారాల్లో భారీగా పెరిగిన కరోనా కేసులు

రాష్ట్రంలో 15 వారాల్లో భారీగా పెరిగిన కరోనా కేసులు
  • మార్చి 2న ఫస్ట్ కేసు.. ఇప్పుడు 4,974
  • మర్కజ్‌ లింక్‌తో ఒక్కసారిగా పెరిగిన కేసులు
  •  మార్చిలో 97 మందికి, ఏప్రిల్‌‌లో 941 మందికి వైరస్
  • ఈ నెలలో ఇప్పటికే 2,276 కేసులు
  •  పెరుగుతున్న కేసులు, డెత్స్.. 10 రోజుల్లోనే 100 మంది మృతి

 

కరోనా కల్లోలం కొనసాగుతోంది. ప్రపంచవ్యా ప్తంగా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. రాష్ట్రంలోనూ రోజూ వందల్లో కేసులు నమోద వుతున్నాయి. ఈ మహమ్మారి మన రాష్ట్రంలోకిఎంటరై సోమవారానికి 15 వారాలు పూర్తయింది. ఒక్కటిగా మొదలై.. వందలుగా మారి.. ఇప్పుడు వేలల్లోకి చేరాయి కేసులు. వైరస్ ఇప్పుడు రాష్ర్ట మంతటా విస్తరించింది. ఆదివారం నాటికి 4,974 మందికి సోకింది.185 మందిని బలి తీసుకుంది. దుబాయ్ వెళ్లొచ్చిన వ్యక్తితో మొదలు.. దుబాయ్ వెళ్లొచ్చి న హైదరాబాద్‌ వ్యక్తికి కరోనా సోకినట్టు మార్చి 2న డాక్టర్లు గుర్తించారు. తర్వాత మరో పది రోజుల దాకా కేసులు నమోదు కాలేదు. మార్చి 13న రెండో కేసు నమోదైంది. ఇక అప్పటి నుంచి కేసుల సంఖ్య పెరుగుతూ నే ఉంది. కరోనా ప్రభావిత దేశాలైన చైనా, అమెరికా, ఇటలీ నుంచి రాష్ర్టానికి వేల మంది మార్చిలో తిరిగొచ్చారు. వాళ్లలో 35 మందికి వైరస్ సోకింది. వాళ్లద్వారా మరో 18 మందికి కరోనా అంటుకుంది. దీంతో మార్చిచివరి వరకు కేసులు పెరగలేదు. రోజూ పది లోపే వచ్చాయి. చివరి వారంలో ఢిల్లీ మర్కజ్‌ లింకుతో ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరిగింది. మార్చి 27న 14 మందికి కన్ఫామ్, ఒకరు చనిపోయారు. రాష్ర్టంలో అదే తొలి కరోనా మరణం. దీంతో మర్కజ్ వెళ్లినోళ్లంతా టెస్టులు చేయించుకోవాలని 30న సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. తర్వాతి రోజు నుంచి వందల మంది గాంధీకి క్యూ కట్టారు. ఏప్రి ల్‌లో తొలి వారంలోనే 260కిపైగా కేసులు వచ్చాయి. అలా 3 వారాల పాటు మర్కజ్‌ లింకుతో వందల కేసులు వచ్చాయి. మార్చిలో 97 కేసులు నమోదైతే, ఏప్రిల్‌లో ఏకంగా ఈ సంఖ్య 941కి చేరింది.

 కాంటాక్టులకు టెస్టులు బంద్‌

కేసులు పెరిగిపోవడంతో ఏప్రిల్ మూడో వారం నుంచి ప్రైమరీ కాంటాక్టులకూ టెస్టులు చేయడం బంద్ పెట్టారు. దాంతో ఏప్రిల్ చివరి వారం, మే తొలి వారంలో కలిపి 195 కేసులే వచ్చాయి. టెస్టులు ఆపేయడంపై మీడియాలో వార్తలు రావడం, బాధితుల నుంచి ఒత్తిడి పెరగడంతో గ్రేటర్ హైదరాబాద్‌లో పాజిటివ్ వ్యక్తుల ప్రైమరీ కాంటాక్టులకు టెస్టులు రీస్టా ర్ట్ చేశారు. దీంతో గ్రేటర్‌‌లో కేసుల సంఖ్య పెరిగింది. రోజు వందల్లో కేసులు వస్తున్నాయి.

 20 రోజుల్లోనే 3,120 మందికి..

ఐసీఎంఆర్ రూల్స్ అంటూ సర్కారు ప్రైమరీ కాంటాక్టులకు టెస్టులు చేయలేదు. దగ్గు, జలుబుతో ఎవరైనా వచ్చినా కుదరదంటూ నిరాకరించింది. దాంతో చాలా మంది అసింప్టమాటిక్ క్యారియర్లు గా మారారు. గత 3 వారాలుగా రాష్ర్టంలో కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఆదివారం నాటికి 4,974 మందికి కన్ఫామ్ అయింది. మార్చి 2 నుంచి మే 24 వరకూ 1,854 కేసులు వస్తే.. గత 20 రోజుల్లోనే 3,120 మందికి సోకింది. చాలా కేసుల్లో వైరస్ ఎవరి నుంచి సోకిందో అధికారులు తెలుసుకోలేకపోతున్నా రు. గ్రేటర్ హైదరాబాద్‌లో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. రాష్ర్టంలో ని మొత్తం కేసుల్లో60 శాతానికి పైగా ఇక్కడే నమోదయ్యాయి. మార్కెట్లలో చిరు వ్యా పారుల దగ్గర్నుంచి సెక్రటేరియట్లో ఆఫీసర్లవరకు ప్రతి ఒక్కరూ కరోనా భయంతో వణికిపోతున్నారు.

టెస్టుల్లోలాస్ట్‌

త్రిపుర, గోవా, ఉత్తరాఖండ్ వంటి చిన్న రాష్ట్రాల్లో నూ మనకంటే ఎక్కువ టెస్టులు చేశారు. శనివారం నాటికి రాష్ర్టంలో 40,217 టెస్టులు చేశారు. టెస్టుల సంఖ్యలో మనం 23వ స్థానంలో ఉండగా, దేశంలోని 18 రాష్ర్టాల్లో లక్షకుపైగా టెస్టులు చేశారు. పక్క రాష్ట్రం ఏపీలో ఏకంగా ఐదున్నర లక్షల మందికి టెస్ట్ చేశారు. వైరస్‌ను కంట్రోల్‌ చేయడానికి టెస్టులు, ట్రేసింగ్‌ తప్పనిసరని ఎక్స్ పర్టులు చెబుతున్నారు.

20 – 50 ఏండ్ల వాళ్లే ఎక్కువ

పుట్టిన బిడ్డనుంచి పండు ముసలి వరకు ఎవరినీ కరోనా వదలట్లేదు. అయితే కరోనా బారిన పడుతున్న వారిలో ఎక్కువగా వర్కింగ్‌ ఏజ్ వాళ్లేఉంటున్నారు. శనివారం నాటికి వైరస్ సోకిన 4,737 మందిలో సుమారు 2,900 మంది 20 నుంచి 50 ఏండ్ల మధ్య వయసు వాళ్లే. పని ప్రదేశాల్లోఎవరో ఒకరికి వైరస్ సోకితే, అక్కడున్న మరికొందరు దాని బారిన పడుతున్నారు. లక్షణాలు మొదలవగానే టెస్టులు చేస్తేకొంత వరకైనా వైరస్ కట్టడి అవుతుందని ఎక్స్ పర్టులు చెబుతున్నారు.