
కరోనా వైరస్ తన ఆకృతిని మార్చుకోవడంపై సైంటిస్ట్ లు హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఐరోపా, ఉత్తర అమెరికాతో పాటు ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో వైరస్ తన ఆకృతిని మార్చుకొని మరింత ప్రాణాంతకంగా మారే అవకాశాలున్నట్లు సైంటిస్ట్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
అయితే సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ సీనియర్ కన్సల్టెంట్ , ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ ఇన్ఫెక్టియస్ డిసీజెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన పాల్ తంబ్యాహ్ మాట్లాడుతూ ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో వైరస్ తన ఆకృతిని మారింది. దానికి డీ614జీ అని నామకరణం చేశాం. కానీ వైరస్ ఆకృతి మారడంపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మేం చేసిన పరిశోధనల్లో దాని ప్రభావం అంతతీవ్రంగా లేదని చెప్పారు.
చాలా వైరస్ లు ఆకృతి మార్చుకున్నప్పుడు ఎక్కువ మందికి వ్యాపిస్తాయి. కానీ అలా వ్యాపించడం వల్ల మరణాలు సంభవించవు. ఎందుకంటే తినే ఆహారం, వ్యక్తి శరీరంపై ఆధారపడి ఉంటుంది.
వైరస్ ఆకృతితో ప్రమాదం ఏమీలేదు
కరనా రూపాంతరం వల్ల ప్రమాదం లేదని డబ్ల్యూహెచ్ ఓ తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా తో పాటు, యూరప్ లో వైరస్ ఆకృతి ఆనవాళ్లం గుర్తించాం. వాటి వల్ల అంత ప్రమాదం లేదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు వెల్లడించారు.