క‌రోనా పై బాంబ్ పేల్చిన బిల్ గేట్స్ : 2021 చివ‌రి నాటికి

క‌రోనా పై  బాంబ్ పేల్చిన బిల్ గేట్స్ : 2021 చివ‌రి నాటికి

వ‌చ్చే ఏడాది చివ‌రి నాటి ప్ర‌పంచ దేశాల్లో క‌రోనా వైర‌స్ త‌గ్గుముఖం ప‌డుతుందంటూ మైక్రో సాఫ్ట్ వ్య‌వ‌స్థాప‌కుడు బిల్ గేట్స్ బాంబు పేల్చారు.

క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్ ను విడుద‌ల చేస్తున్నామంటూ ర‌ష్యా ప్ర‌క‌టించ‌డంతో ప్ర‌పంచ దేశాలు ఆ వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ అమెరికా మ్యాగ్జిన్ వైర్డ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బిల్ గేట్స్ చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌వ‌రానికి గురిచేసేలా చేస్తున్నాయి

వ్యాక్సిన్ వచ్చే ఏడాది చివ‌రి నాటికి చాలా దేశాలలో క‌రోనా వైర‌స్ త‌గ్గిపోతుంద‌ని బిల్ గేట్స్ చెప్పారు. 2022 నాటికి ప్రపంచం మొత్తం త‌గ్గిపోతున్న‌ట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల్ల ఆర్ధికంగా బ‌ల‌ప‌డ‌డం క‌ష్ట‌మేన‌న్న ఆయ‌న‌..వైద్య రంగంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయ‌న్నారు.

2021 చివరి నాటికి చాలా దేశాలు మ‌మ్మారి నుంచి బ‌య‌ట‌ప‌డ‌తాయ‌ని, 2022 కొన్ని దేశాల్లో క‌రోనా వైర‌స్ ఘోరమైన వ్యాప్తి అనంతం ముగుస్తుంద‌ని వెల్ల‌డించారు.

వ్యాక్సిన్ కోసం బిల్ గేట్స్ నిధులు

పుణెకు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్​ ఇండియా (ఎస్‌ఐఐ) కీలక ఒప్పందం కుదుర్చుకున్న విష‌యం తెలిసిందే. బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్‌తో కలిసి అతి తక్కువ ధరకు కరోనా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.

ఈ డీల్‌ ప్రకారం వ్యాక్సిన్ కోసం గేట్స్ ఫౌండేషన్ నుంచి 150 మిలియన్ డాలర్ల నిధులు సీరంకు అందనున్నాయి. ఈ నేపథ్యంలో 10 కోట్ల మోతాదులో కరోనా వ్యాక్సిన్‌లను తయారీ చేయనున్నామని సీరం తెలిపింది. ఈ వ్యాక్సిన్ ధర(ఒక్కో డోస్‌కి) గరిష్టంగా 3 డాలర్లు (దాదాపు 225 రూపాయలు) ఉంటుందని వివరించింది.

ఈ వ్యాక్సిన్‌ని 92 దేశాల్లో గవికి చెందిన కోవ్యాక్స్ అడ్వాన్స్ మార్కెట్ కమిట్‌మెంట్ (ఏఎంసీ)లో అందుబాటులోకి తీసుకురానున్నట్టు ప్రకటించింది. 2021 చివరి నాటికి కోట్లాడి వ్యాక్సిన్లను అందించడమే తమ ప్రధాన లక్ష్యమని సీరమ్‌ ఓ ప్రకటనలో తెలిపింది.