క‌రోనా సోకింద‌ని చెప్తావా..ఆశావ‌ర్క‌ర్ పై పేషెంట్ బంధువుల దాడి

క‌రోనా సోకింద‌ని చెప్తావా..ఆశావ‌ర్క‌ర్ పై పేషెంట్ బంధువుల దాడి

సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం తాళ్ల సింగారంలో దారుణం జ‌రిగింది. ఆశ వర్కర్ పై కరోనా పాజిటివ్ వచ్చిన పేషేంట్ బంధువులు దాడి చేశారు. పాజిటివ్ సమాచారం బయటకు చెప్పారని బాధితుడి బంధువులు విచక్షణా రహితంగా దాడి చేశారు. దీంతో భ‌యాందోళ‌న‌కు గురైన బాధితురాలు పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు.