‘ఆయుష్మాన్’ వర్గాలకే ఫ్రీ కరోనా వైరస్ టెస్టులు: సుప్రీం ఆదేశాలు

‘ఆయుష్మాన్’ వర్గాలకే ఫ్రీ కరోనా వైరస్ టెస్టులు: సుప్రీం ఆదేశాలు

న్యూఢిల్లీ: ప్రైవేటు ల్యాబ్స్ లో  కరోనా టెస్టులు ఫ్రీగా జరపాలంటూ ఈ నెల8న ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సోమవారం సవరించింది. ఆయుష్మాన్ భారత్ స్కీమ్ లో బెనిఫిట్ పొందుతున్న డబ్బులేని నిరుపేదల కు మాత్రమే టెస్టులు ఫ్రీగా చేయాలని స్పష్టం చేసింది. డబ్బులు పెట్టగలిగే సామర్ధ్యం ఉన్న వారికి ఈ టెస్టులు ఉచితంగా చేయమనడం తన ఉద్దేశం కాదని అభిప్రాయపడింది. పరీక్షలకు ప్రైవేటు ల్యాబ్లు రూ.4,500 తీసుకుంటుండటంతో.. కష్టకాలంలో ప్రైవేటు ల్యాబ్ లు డబ్బులు తీసుకోవడం సరికాదని, దాతృత్వ ధోరణిలో ఫ్రీగా టెస్టులు చేయాలని గత బుధవారం సుప్రీం తీర్పు చెప్పింది. ఉచితంగా టెస్టులు చేస్తే ప్రైవేటు ల్యాబ్లపై తీవ్ర ఆర్ధిక భారం పడుతుందని ఆర్థోపెడిక్ సర్జన్  కౌశల్ కాంత్ మిశ్రా సుప్రీంకు విన్న వించారు. దీనివల్ల కరోనా టెస్టుల ప్రక్రియ నెమ్మదిస్తుందని చెప్పారు. దీనిపై సోమవారం విచారించిన బెంచ్ .. ప్రభుత్వం నోటిఫై చేసిన ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వారికే ఫ్రీ కరోనా పరీక్షలు చేయాలని ఆదేశించింది.