కరోనా భయం.. ఓ బార్‌‌లో స్పెషల్ ఫిష్ బౌల్ స్క్రీన్స్‌ ఏర్పాటు

కరోనా భయం.. ఓ బార్‌‌లో స్పెషల్ ఫిష్ బౌల్ స్క్రీన్స్‌ ఏర్పాటు

టోక్యో: కరోనా కారణంగా చాలా రోజులు హోటళ్లు, బార్లు మూసివేశారు. ఆ దేశం, ఈ దేశం అనే తేడా లేకుండా అన్ని కంట్రీస్‌లోనూ ఇదే పరిస్థితి. కానీ ఇప్పుడు వాటిని తెరుస్తున్నారు. అయితే వైరస్ సోకుతుందేమోననే భయంతో రెస్టారెంట్స్‌, హోటల్స్, బార్లకు వెళ్లడానికి ప్రజలు జంకుతున్నారు. ఎలాగైనా ప్రజలను రప్పించడానికి వెరైటీ డిషెస్ చేస్తూ, ఆఫర్స్ ప్రకటిస్తూ, తగిన సేఫ్టీ మెజర్స్‌ తీసుకుంటూ రెస్టారెంట్స్, బార్‌‌ షాప్ ఓనర్స్ ప్లాన్ చేస్తున్నారు. తాజాగా జపాన్‌లో ఓ బార్‌‌ ఇలాగే కస్టమర్స్‌కు కరోనా సోకకుండా వినూత్నంగా జాగ్రత్త చర్యలు తీసుకుంది. జాజ్ లాంగ్ ఎన్ కౌంటర్ అనే ఈ బార్‌‌ను జూన్‌లో రీఓపెన్ చేశారు. కస్టమర్స్ సేఫ్టీగా ఫీల్ అయ్యేందుకు సదరు బార్ నిర్వాహకులు స్పెషల్ ఫిష్ బౌల్ స్క్రీన్స్‌ను ఏర్పాటు చేయడం గమనార్హం.

కోనికల్ క్లియర్ అక్రిలిక్ స్క్రీన్స్‌ను కస్ట్‌మర్స్‌ తల, భుజాలను కవర్ చేసేలా పైనుంచి వేలాడేలా నిర్వాహకులు వాటిని అమర్చారు. ఈ షీట్స్‌ ఒక కస్టమర్‌‌కు మరో కస్టమర్‌‌కు మధ్య దూరం ఉండేలా ఏర్పాటు చేశారు. అలాగే సర్వర్స్‌ కూడా దూరం నుంచే సర్వ్ చేసేలా అరేంజ్‌మెంట్స్‌ చేశారు. దీనిపై కస్టమర్స్‌తోపాటు సర్వర్స్ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంటే నేను కస్టమర్స్‌తో సరిగ్గా మాట్లాడేను. కానీ ఈ జాగ్రత్త చర్యలు ఏర్పాటు చేసిన తర్వాత నేను సురక్షితంగా భావిస్తున్నా’ అని 27 ఏళ్ల మాకో ఓకీ అనే స్టాఫ్ వర్కర్ చెప్పాడు.