హైదరాబాద్‌‌‌‌లలో పెరిగిన లివింగ్ కాస్ట్‌‌

హైదరాబాద్‌‌‌‌లలో పెరిగిన లివింగ్ కాస్ట్‌‌
  • ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌‌‌‌లలో పెరిగిన లివింగ్ కాస్ట్‌‌
  • ఫారిన్ ఉద్యోగులకు కష్టామే అంటున్న మెర్సెర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్వే
  • గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా హాంకాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జూరిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ

బిజినెస్ డెస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: దేశంలోని టాప్ ఐదు సిటీలలో నివసించడం బాగా ఖరీదుగా మారిందని ఓ సర్వే వెల్లడించింది. ముఖ్యంగా ఫారిన్ ఉద్యోగులు ఈ సిటీలలో నివసించడం ఎక్కువ ఖర్చుతో కూడుకున్నదని తెలిపింది. మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ కన్సల్టన్సీ కంపెనీ  మెర్సెర్స్‌‌‌‌‌‌‌‌  ‘మెర్సెర్స్‌‌‌‌‌‌‌‌ 2022 కాస్ట్ ఆఫ్ లివింగ్‌‌‌‌‌‌‌‌ సిటీ ర్యాంకింగ్స్‌‌‌‌‌‌‌‌’ ను విడుదల చేసింది. దేశంలో  లివింగ్ కాస్ట్‌‌‌‌‌‌‌‌ ఎక్కువగా ఉన్న సిటీలలో ముంబై టాప్‌‌‌‌‌‌‌‌లో ఉంది. గ్లోబల్‌‌‌‌‌‌‌‌గా చూస్తే 127 వ ర్యాంక్‌‌‌‌‌‌‌‌లో ఈ సిటీ నిలిచింది. ఇంటర్నేషనల్ ఉద్యోగులు ముంబైలో నివసించడం ఎక్కువ ఖరీదుగా మారిందని మెర్సెర్స్‌‌‌‌‌‌‌‌ సర్వే వివరించింది. ముంబై తర్వాత కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువగా ఉన్న సిటీలలో న్యూఢిల్లీ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లు ఉన్నాయి. గ్లోబల్‌‌‌‌‌‌‌‌గా చూస్తే ఈ సిటీలు వరసగా 155, 177, 178 , 192వ ప్లేస్‌‌‌‌‌‌‌‌లలో నిలిచాయి. మెర్సెర్స్‌‌‌‌‌‌‌‌ ర్యాంకింగ్స్ బట్టి చూస్తే దేశంలో నివాసం చౌకగా ఉన్న సిటీలలో పుణే, కోల్‌‌‌‌‌‌‌‌కతాలు టాప్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయి. కాస్ట్ ఆఫ్ లివింగ్ ర్యాంకింగ్‌‌‌‌‌‌‌‌లో ఈ సిటీలు 201, 203 ర్యాంక్‌‌‌‌‌‌‌‌లను దక్కించుకున్నాయి.

ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్ ఎక్కువవ్వడంతోనే..
వివిధ సిటీలలోని సుమారు 200 కు పైగా అంశాలను పోల్చి ఈ ర్యాంక్స్ ఇచ్చామని మెర్సెర్స్ పేర్కొంది. హౌసింగ్‌‌‌‌‌‌‌‌, ట్రాన్స్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌, ఫుడ్‌‌‌‌‌‌‌‌, క్లాత్స్‌‌‌‌‌‌‌‌, ఇండ్లలో వాడే వస్తువులు, ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌మెంట్ వంటి వివిధ అంశాలకు చేసే ఖర్చులను పరిగణనలోకి తీసుకొని సిటీలను పోల్చామని వివరించింది.  తమ ఉద్యోగులను ఇతర దేశాలకు పంపేటప్పుడు అక్కడి పరిస్థితులను తగ్గట్టు ఉద్యోగులకు పరిహారం అందించడానికి   కంపెనీలకు ఈ సర్వే డేటా సాయపడుతుందని మెర్సెర్స్ అభిప్రాయపడింది. గ్లోబల్‌‌‌‌‌‌‌‌గా చూస్తే  కాస్ట్ ఆఫ్‌‌‌‌‌‌‌‌ లివింగ్‌‌‌‌‌‌‌‌ హాంకాంగ్‌‌‌‌‌‌‌‌లో ఎక్కువగా ఉంది. ఒక్క స్విట్జర్లాండ్‌‌‌‌‌‌‌‌లోనే నాలుగు సిటీలు రెండు నుంచి ఐదో ర్యాంక్ వరకు ఉన్నాయి. స్విట్జర్లాండ్‌‌‌‌‌‌‌‌లోని జూరిచ్‌‌‌‌‌‌‌‌, జెనీవా, బసెల్‌‌‌‌‌‌‌‌, బెర్నె సిటీలు టాప్‌‌‌‌‌‌‌‌5 లో ఉన్నాయని మెర్సెర్స్‌‌‌‌‌‌‌‌ సర్వే వెల్లడించింది. అలానే ఆసియాలోని మరో మూడు సిటీలు కూడా టాప్‌లో ఉన్నాయి. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువగా ఉన్న సిటీలలో  సింగపూర్ (8 వ ర్యాంక్‌‌‌‌‌‌‌‌), టోక్యో (9), బీజింగ్‌‌‌‌‌‌‌‌ (10) లు టాప్‌‌‌‌‌‌‌‌ 10 లో ఉన్నాయి. వర్క్ కోసం ఈ సిటీలకు వెళ్లే ఫారిన్ ఉద్యోగులు అక్కడి లివింగ్‌‌‌‌‌‌‌‌ కాస్ట్‌‌‌‌‌‌‌‌కు తగ్గట్టు ఎక్కువ ఖర్చు చేయాలి. ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌‌‌‌‌ పెరగడంతో పాటు, ఆయా దేశాల కరెన్సీ వాల్యూ తగ్గిపోవడంతో చాలా ఆసియా సిటీలలో నివాసం ఖరీదుగా మారింది. ఫారిన్ ఉద్యోగులు నివసించడానికి చౌకగా అనిపించే సిటీల్లో అంకారా (టర్కీ), బిష్కెక్‌‌‌‌‌‌‌‌ (కిర్గిస్తాన్‌‌‌‌‌‌‌‌), దుషాంబే (తజకిస్తాన్‌‌‌‌‌‌‌‌) టాప్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయి. ‘కరోనా సంక్షోభం, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, లోకల్ కరెన్సీ వాల్యూలో వోలటాలిటీ, ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌‌‌‌‌ విపరీతంగా పెరగడం వంటి అంశాలు ఉద్యోగుల శాలరీ, సేవింగ్స్‌‌‌‌‌‌‌‌పై ప్రభావం చూపుతున్నాయి. గత 18 నెలల్లో ఆసియాలోని సిటీలకు షిప్ట్ అయిన ప్రొఫెషనల్స్​ సంఖ్య సగానికి తగ్గింది’ అని మెర్సెర్స్‌‌‌‌‌‌‌‌ వివరించింది.