ఒక్కో విద్యార్థిపై సర్కార్ పెడుతున్నఖర్చు రూ.63,637

ఒక్కో విద్యార్థిపై సర్కార్ పెడుతున్నఖర్చు రూ.63,637

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 30 మంది కంటే తక్కువ ఉన్న బడుల్లో ఒక్కో స్టూడెంట్​పై సర్కారు రూ.63,637 ఖర్చు చేస్తోంది. 200 మందికిపైగా ఉన్న స్కూళ్లలో రూ.22,715 వ్యయం చేస్తోంది. స్కూళ్లలో స్టూడెంట్ల సంఖ్యకు అనుగుణంగా సర్కారు పెడుతున్న ఖర్చులో హెచ్చతగ్గులు కనిపిస్తున్నాయి. విద్యా శాఖ నుంచి తీసుకున్న వివరాల ఆధారంగా జేపాల్ అనే స్వచ్ఛంద సంస్థ ఈ విషయాలను విశ్లేషించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 24,550 స్కూళ్లుండగా, వాటిలో 1,37,471 మంది టీచర్లు పనిచేస్తున్నారు. ఏటా శాలరీలకు అయ్యే ఖర్చు రూ.7,956 కోట్లుగా గుర్తించారు. సరాసరి ఒక్కో టీచర్ కు శాలరీ కింద రూ.5.78 లక్షలు ఖర్చవుతోంది. 30 మందిలోపు స్టూడెంట్లున్న స్కూళ్లు 9,505 ఉండగా, వాటిల్లో 17,808 మంది టీచర్లు పనిచేస్తున్నారు. 30లోపు స్టూడెంట్లున్న బడుల ఖర్చుతో పోలిస్తే 200 మంది ఉన్న స్కూళ్లలో మూడో వంతే ఖర్చు అవుతోంది.