ఎస్టీ కమిషన్‌‌ ఏర్పాటుపై కౌంటర్ వేయండి. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

ఎస్టీ కమిషన్‌‌ ఏర్పాటుపై కౌంటర్ వేయండి. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: ఎస్టీల కోసం ప్రత్యేకంగా కమిషన్‌‌ ఏర్పాటు చేయాలనే అంశంపై కౌంటర్‌‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని చీఫ్‌‌ జస్టిస్‌‌ అలోక్‌‌ అరాధే, జస్టిస్‌‌ ఎన్‌‌.వి. శ్రవణ్‌‌ కుమార్లతో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌ ఆదేశించింది. ఎస్సీ, ఎస్టీల సవరణ బిల్లు 2013, రాజ్యాంగంలోని అధికరణ 338ఎ (3) ప్రకారం ప్రత్యేకంగా ఎస్టీ కమిషన్‌‌ ఏర్పాటు చేయాలన్న నిబంధనను ప్రభుత్వం అమలు చేయడం లేదంటూ తెలంగాణ లంబాడీ హక్కుల పోరా సమితి నగరభేరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బూక్యా దేవా నాయక్‌‌ పిల్‌‌ వేశారు. దీనిపై కౌంటర్‌‌ వేసేందుకు గడువు కావాలని ప్రభుత్వం కోరగా.. 4 వారాల గడువును ఇస్తూ చీఫ్‌‌ జస్టిస్‌‌ అలోక్‌‌ అరాధే, జస్టిస్‌‌ ఎన్‌‌. వి. శ్రవణ్‌‌ కుమార్లతో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌ ఉత్తర్వులు జారీ చేసింది.