
ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు కౌంటింగ్ ప్రారంభమైంది.ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలు కాగా ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తున్నారు. గత నెల 16న 60 స్థానలకు త్రిపుర ఎన్నికలు జరగగా 27న మేఘాలయ, నాగాలాండ్ లలో ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం త్రిపురలో బీజేపీ ప్రభుత్వం ఉండగా, మేఘాలయలో నేషనల్ పీపుల్స్ పార్టీ… ఎన్‌పీపీ అధికారంలో ఉంది. ఇక నాగాలాండ్‌లో నార్త్ ఈస్డ్ డెమొక్రటిట్ అలయన్స్ గవర్నమెంట్ కొనసాగుతోంది. ఇక ఈ ఫలితాలతో పాటుగా అరుణాచల్ ప్రదేశ్‌లోని లుమ్లా అసెంబ్లీ స్థానం, రామ్‌గఢ్ (జార్ఖండ్), ఈరోడ్ ఈస్ట్ (తమిళనాడు), సాగర్దిఘి (పశ్చిమ బెంగాల్) మహారాష్ట్రలోని కస్బా పేత్, చించ్వాడ్ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల కౌంటింగ్ కూడా ప్రారంభమైంది. మరికొన్ని గంటల్లో ఫలితాలు వెలువడునున్నాయి.