పెరుగుతున్న ఫారెక్స్ నిల్వలు

పెరుగుతున్న ఫారెక్స్ నిల్వలు
  • మార్చి 1 తో ముగిసిన వారంలో 625.626 బిలియన్ డాలర్లకు

న్యూఢిల్లీ: దేశ ఫారెక్స్ నిల్వలు ఈ నెల 1 తో ముగిసిన వారంలో 6.55 బిలియన్ డాలర్లు పెరిగి 625.626 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అంతకు ముందు వారంలో  2.975 బిలియన్ డాలర్లు పెరిగి 619.072 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఫారెక్స్‌‌‌‌ నిల్వలు 2021 అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో  645 బిలియన్ డాలర్ల దగ్గర  ఆల్ టైమ్ రికార్డ్‌‌‌‌ను నమోదు చేశాయి. ఆ తర్వాత ఈ లెవెల్‌‌‌‌ను టచ్ చేయలేదు. డాలర్ బలపడడంతో మారకంలో రూపాయి విలువ కిందటేడాది తగ్గింది. 

ఫారెక్స్ మార్కెట్‌‌‌‌లో వోలటాలిటీని తగ్గించేందుకు ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ డాలర్లను అమ్మడం మొదలు పెట్టింది. దీంతో కిందటేడాది ఫారెక్స్ రిజర్వ్‌‌‌‌లు బాగా తగ్గాయి. తాజాగా పుంజుకుంటున్నాయి. ఫారెక్స్ నిల్వల్లో మేజర్ పార్ట్ అయిన  ఫారిన్ కరెన్సీ అసెట్స్‌‌‌‌ ఈ నెల 1 తో ముగిసిన వారంలో 6.043 బిలియన్ డాలర్లు పెరిగి 554.231 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఫారిన్ కరెన్సీ అసెట్స్‌‌‌‌ను   డాలర్లలో తెలియజేస్తున్నప్పటికీ, యూరో, పౌండ్‌‌‌‌, యెన్ వంటి ఇతర దేశాల కరెన్సీలు కూడా ఇందులో కలిసి ఉంటాయి. గోల్డ్ రిజర్వ్‌‌‌‌లు 569 మిలియన్ డాలర్లు పెరిగి 48.417 బిలియన్ డాలర్లకు చేరుకుందని ఆర్‌‌బీఐ పేర్కొంది.