ఐదేళ్లలో 661 పులులు మృత్యువాత

 ఐదేళ్లలో 661 పులులు మృత్యువాత

గడిచిన ఐదేళ్లలో 661 పులులు మృత్యువాత పడినట్లుగా కేంద్ర అటవీ మంత్రిత్వశాఖ  వెల్లడించింది.  వృద్ధాప్యం, వ్యాధులు, అంతర్గత పోరాటాలు, విద్యుదాఘాతం, రోడ్డు, రైలు ప్రమాదాల కారణంగా ఎక్కువగా పులులు చనిపోయినట్లుగా వెల్లడించింది.  అయితే ఇందులో ఎక్కువగా పెద్ద పులులున్నాయని తక్కువగా శిశుమరణాలున్నట్లు గుర్తించామంది.  

చనిపోయిన 661 పులులలో 516 పులులు సహజ కారణలతో,  126 పులులను వేటాడడం ద్వారా, 19 పులులు ఇతర కారణలతో చనిపోయాయని తెలిపింది.  గతేడాది  121 పులులు మరణించాయని వెల్లడించింది.   గత నాలుగేళ్లలో పులుల సంఖ్య 715 పెరిగాయని చెప్పి్ంది.  అడవిలో పులుల సగటు జీవిత కాలం సాధారణంగా 10 నుంచి 12 ఏళ్లలోపు ఉంటుందని కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ తెలిపింది.