
పద్మారావునగర్, వెలుగు: రియల్ ఎస్టేట్ మోసాలకు పాల్పడుతున్న దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. నార్సింగికి చెందిన పరశురాములు, మాధవి భార్యాభర్తలు. స్కందశ్రీ ఇన్ఫ్రా పేరుతో సంస్థను ఏర్పాటు చేసి, భూముల క్రయవిక్రయాలు చేస్తామని ఆన్లైన్లో ప్రకటనలు ఇచ్చారు.
బోయిన్‌పల్లికి చెందిన రమ్య, వీణ వారిని సంప్రదించగా, తమ వద్ద సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో ప్లాట్లు ఉన్నాయని నమ్మబలికారు. దీంతో బాధితులిద్దరూ రూ.22.50 లక్షలు బదిలీ చేశారు. ప్లాట్లు రిజిస్ట్రేషన్చేయకుండా దాటవేస్తూ ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.