అక్రమ సంబంధం బయటపడిందని.. ఆత్మహత్య

అక్రమ సంబంధం బయటపడిందని.. ఆత్మహత్య

కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలకేంద్రానికి చెందిన ఈరం బాలనర్సు (38), ఎర్రొల్ల ప్రేమలత(35) శుక్రవారం రాత్రి గ్రామ శివారులోని మర్రిచెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నా రు. బాలనర్సుకు పెళ్లి కాగా ఇద్దరు కొడుకులు, ప్రేమలతకు ఒక కొడుకు ఉన్నారు. వీరిద్దరి మధ్య కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ విషయం ఇరు కుటుంబాలకు తెలియడంతో ఇబ్బందులు ఎదురవుతాయని భావించి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం ఇంట్లో నుంచి బయటకు వెళ్లినట్లు చెబుతున్నారు. శనివారం ఉదయం గ్రామ శివారులో చెట్టుకు ఉరివేసుకొని వేలాడుతుండగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి