
కాలం మారింది. సాంప్రదాయ వివాహ వేదికల యుగానికి వీడ్కోలు చెప్పడం ఎప్పుడో మొదలైంది. ఎందుకంటే ఇప్పుడు ప్రేమ అనే ఆయుధం ప్రపంచాన్ని ఏలుతోంది. రీసెంట్ డేస్ లో ఆస్పత్రులు, విమానాలు, పార్కులు లాంటి స్థలాలే కళ్యాణ మండపాలవుతున్నాయి. పెళ్లి అనే బంధంతో ఒక్కటవ్వడానికి స్థలంతో సంబంధమేమిటన్న విషయాన్ని ఇప్పుడు చాలా మంది సీరియస్ గా తీసుకుంటున్నారు. వివాహం అనే చిరస్మరణీయమైన క్షణానికి ఫ్యాన్సీ హోటళ్లు, బ్యాంకెట్ హాల్స్ అవసరం లేదని ఓ జంట రుజువు చేసింది. దీనికి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వైరల్ ఫుటేజ్ రైలులో దంపతులుగా మారిన ఈ జంట దండలు మార్చుకోవడం, వారి హృదయపూర్వక కలయికను చూసిన తోటి ప్రయాణికులు చుట్టుముట్టడం చూపిస్తుంది. అతను ఆ స్త్రీకి నుదిట తిలకం దిద్ది, వారి వైవాహిక ప్రయాణానికి నాంది పలికాడు. దండలు మార్చుకున్న తర్వాత భావోద్వేగంతో వధువు వరుడిని ఆలింగనం చేసుకుంది. చూపరుల హర్షధ్వానాల మధ్య, అతను.. ఆమె మెడలో మంగళసూత్రాన్ని కట్టాడు. అసన్సోల్-జాసిదిహ్ రైలులో ఈ విచిత్రమైన వివాహం జరిగిందని నివేదికలు సూచిస్తున్నప్పటికీ, దీనిపై అధికారిక రుజువు ఏదీ లేదు.
ఊహించినట్లుగానే ఈ వీడియో సోషల్ మీడియా రియాక్షన్స్‌తో నిండిపోయింది. భారతీయ రైల్వేతో బహుళ ప్రయోజనాలు అని ఒకరు, బడ్జెట్ తక్కువగా ఉండాలంటే రైలు.. లేదంటే విమానంలో వెళ్లొచ్చు అని మరొకరు చమత్కరించారు.