
చిత్తూరు : జిల్లాలోని గంగవరం మండలంలో సోమవారం ఉదయం ఒళ్లు గగుర్పాటు కలిగించే సంఘటన చోటు చేసుకుంది. ఒక జంట బైక్ పై రోడ్డు క్రాస్ చేయబోతుండగా వెనకాలే వేగంగా వచ్చిన బెంజ్ కారు వారిని ఢీకొట్టింది. దీంతో గాల్లోకి ఎగిరిన వారిద్దరూ కారు కింద పడ్డారు. అయితే క్షణాల్లో కారులో నుంచి దిగి వచ్చిన వ్యక్తులు వాళ్ళిద్దరినీ కారు కింద నుండి లాగారు. ఇద్దరూ స్వల్ప గాయాలతో బయట పడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనను చూసిన స్థానికులు ఆశ్చర్యానికి లోనయ్యారు.