సద్దుమణిగిన యశోద మూవీ కాంట్రవర్సీ

సద్దుమణిగిన యశోద మూవీ కాంట్రవర్సీ

ఎట్టకేలకు యశోద మూవీ కాంట్రవర్సీ ఇష్యూ సద్దుమణిగింది. యశోద మూవీలో తమ హాస్పిటల్ పేరు వాడటంపై ఈవా హాస్పిటల్స్ యాజమాన్యం కోర్టుకి వెళ్లింది. చెడుగా చూపించడంపై రూ.5 కోట్ల రూపాయల దావా వేసింది. దీంతో మూవీలో ఈవా పేరుని తీసివేస్తున్నామని ప్రొడ్యూసర్ శివలంక కృష్ణప్రసాద్ స్పష్టం చేశారు. ఇకమీదట సినిమాలో ఈవా పేరు ఎక్కడా కనిపించదు, వినిపించదని చెప్పారు. 

దీంతో యశోద మూవీని ఓటీటీలో రిలీజ్ చేయడంపై ఉత్కంఠ తొలగింది.- త్వరలోనే ఓటీటీలో యశోద మూవీ విడుదల కానుంది. కానీ అది ఎప్పుడన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఈ సినిమాలో మొత్తం 87 సార్లు ఈవా లోగోని వాడినట్టు తెలుస్తోంది. అయితే తాజా పరిణామాలతో- యశోద మూవీకి క్లియరెన్స్ వచ్చింది.