
రైటర్ కం డైరెక్టర్ రామ్ జగదీశ్ (Ram Jagadeesh)..జాక్పాట్ కొట్టేశాడు. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju)..కోర్ట్ డైరెక్టర్ రామ్ జగదీష్కు భారీ ఆఫర్ ఇచ్చినట్లు సినీ వర్గాల సమాచారం.
రామ్ జగదీశ్ తన ఫస్ట్ మూవీ ‘కోర్ట్: స్టేట్ వర్సెస్ ఏ నోబడి’తో సూపర్ హిట్ సక్సెస్ అందుకున్నాడు. దాంతో రామ్ జగదీష్ విజన్కు దిల్ రాజు ఫిదా అయ్యాడట. దానికి తోడు చిన్న బడ్జెట్తో, భారీ లాభాలు వచ్చేలా సినిమా తీసి తన సత్తా చాటుకున్నాడు. కనుకే, దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి రామ్ జగదీశ్కు ఆహ్వానం వచ్చినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే, దిల్ రాజు, దర్శకుడు రామ్ జగదీష్ని మంచి కథ రెడీ చేసుకుని రమ్మన్నారట. కథ నచ్చితే ఆ కథకు తగ్గ హీరోను కూడా తానే సెట్ చేస్తానని, కథను బట్టి బడ్జెట్ ఎంతనైనా నిర్మిస్తానని చెప్పారట. అందుకు రామ్ జగదీష్ కూడా త్వరలో ఒక మంచి కథతో.. దిల్ రాజు ముందుకు వెళుతున్నట్లు టాక్. త్వరలో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.
Also Read : సూర్యది గోల్డెన్ హార్ట్
ఇకపోతే, రామ్ జగదీష్ కోర్ట్ మూవీతో నిర్మాత నానికి మంచి లాభాలు వచ్చేలా చేశాడు. కేవలం రూ.10కోట్ల లోపు బడ్జెట్‍తోనే రూపొందిన ఈ మూవీ రూ.56కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్లతో లాభాలు తెచ్చిపెట్టింది. అంతేకాకుండా మంచి ప్రశంసలు కూడా అందుకునేలా చేశాడు.
ఇదిలా ఉంటే.. దిల్ రోజు ఎంతోమంది కొత్త వాళ్లకు మంచి అవకాశం ఇస్తూ వస్తున్నాడు. ఇటీవల కాలంలో జబర్దస్త్ కమెడియన్ వేణుకి బలగం మూవీ నిర్మించి పెద్ద సక్సెస్ ఇచ్చాడు. దాంతో వేణు రెండో మూవీ ఎల్లమ్మ కూడా దిల్ రాజే నిర్మిస్తుండటం విశేషం.
అలాగే, మలయాళం మార్కో మూవీ డైరెక్టర్ హానీఫ్ అదేనికు కూడా మంచి ఆఫర్ ఇచ్చాడు. హానీఫ్తో భారీ యాక్షన్ చిత్రాన్ని పాన్ ఇండియాలో రేంజ్లో ప్లాన్ చేస్తున్నారు. ఇలా ఎంతోమంది న్యూ టాలెంట్స్ను గుర్తిస్తూ ముందుకెళ్తున్నారు దిల్ రాజు. మరి కోర్ట్ డైరెక్టర్ రామ్ జగదీశ్, ఎలాంటి కథతో వెళ్లనున్నాడనేది ఆసక్తిగా మారింది.