Suriya: సూర్యది గోల్డెన్ హార్ట్.. పేద విద్యార్థుల చ‌దువు కోసం.. రెట్రో క‌లెక్ష‌న్స్ నుంచి భారీ విరాళం..

Suriya: సూర్యది గోల్డెన్ హార్ట్.. పేద విద్యార్థుల చ‌దువు కోసం.. రెట్రో క‌లెక్ష‌న్స్ నుంచి భారీ విరాళం..

తమిళ స్టార్‌ హీరో సూర్య కేవలం నటుడిగానే కాకుండా.. సామాజిక సేవలతోనూ గుర్తింపు తెచ్చుకున్నారు. అగరం ఫౌండేషన్‌ ద్వారా పేద విద్యార్థులకు చదువు చెప్పించేందుకు ఆయన కృషి చేస్తున్నారు. గత పదేళ్లుగా ఆయన ఈ ఫౌండేషన్‌ను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సూర్య మ‌రోసారి త‌న మంచి మ‌న‌సును చాటుకున్నారు.

సూర్య నటించిన లేటెస్ట్ రెట్రో మూవీ తమిళనాడులో మంచి విజయం సాధించింది. ఈ సందర్భంగా రెట్రో నుంచి వ‌చ్చిన క‌లెక్ష‌న్స్‌లో రూ.10 కోట్ల‌ను పేద విద్యార్థుల చ‌దువు కోసం విరాళంగా అంద‌జేశాడు. హీరో సూర్య మరియు డైరెక్ట‌ర్ కార్తీక్ సుబ్బ‌రాజుతో క‌లిసి అగ‌రం ఫౌండేష‌న్ స‌భ్యుల‌కు చెక్ అందించారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో సూర్య గొప్ప మ‌న‌సుపై ఆయన ఫ్యాన్స్ మాత్రమే కాకుండా నెటిజన్ల నుంచి ప్ర‌శంస‌లు అందుతున్నాయి.

సూర్య  2006లో అగరం ఫౌండేషన్‌ని స్థాపించి, దాని ద్వారా ఎంతోమంది పేద విద్యార్థుల్ని తన సొంత ఖర్చుతో చదివిస్తున్నాడు. అలాగే, సేవ్ ద టైగర్స్ క్యాంపెయినింగ్లో పాల్గొంటున్నాడు. టీబీ పేషెంట్స్కు సర్వీస్ చేసే 'రీచ్' అనే సంస్థతో కలిసి పని చేస్తున్నాడు.  అంతేకాదు.. ఏ విపత్తు సంభవించినా తమ్ముడు కార్తితో కలిసి తక్షణ సహాయం అందిస్తాడు.

ఇలా ఎవరుంటారు చెప్పండి.. సాధించిన విజయంలో సగం వాటా సమాజానికి ఇచ్చేవాళ్ళు. వచ్చే డబ్బులతో మరో సినిమా తీయాలి.. ఇంత ఖర్చు పెడితే.. ఇన్ని కోట్ల వసూళ్లు వచ్చాయని చెప్పుకోవడంతోనే సరిపోతుంది. కానీ, సూర్య అలా కాడు . గెలుపోటములు ఏ మాత్రం లెక్క చేయడు. కేవలం సామాజిక కోణంలోనే తన జీవితాన్ని సాగిస్తాడు.  ఇలాంటి సూర్యని ఇష్టపడని వారెవరైనా ఉంటారా.. అందుకే సూర్య ఎప్పటికీ గోల్డెన్ హార్ట్!

ఇకపోతే.. రెట్రో మూవీ మే1న రిలీజై తమిళనాడులో దూసుకెళ్తోంది. ఇప్పటికే వంద కోట్ల క‌లెక్ష‌న్స్‌కి పైగా వసూళ్లు సాధించి థియేటర్స్ లో రన్ అవుతుంది. ఈ మూవీ 8 రోజుల్లో రూ.51.09కోట్లకి పైగా నెట్ వసూళ్లు చేసింది. అయితే, రెట్రో సినిమా తెలుగు రాష్ట్రాల‌తో పాటు కేర‌ళ‌, క‌ర్ణాట‌క‌లో మాత్రం రెట్రో డిజాస్ట‌ర్‌గా నిలిచింది.