రాష్ట్రంలో కొత్తగా 47 పాజిటీవ్ కేసులు నమోదు

రాష్ట్రంలో కొత్తగా 47 పాజిటీవ్ కేసులు నమోదు

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1414కి చేరింది. ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ వివరాల ప్రకారం గురువారం కొత్తగా 47కేసులు నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో 40, రంగారెడ్డి జిల్లాలో ఐదు, మరో ఇద్దరు వలస కూలీలకు కరోనా సోకింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1414కు చేరుకుంది.

మరోవైపు తాజా లెక్కల ప్రకారం యాక్టీవ్ కేసులు 428, కరోనా తగ్గి డిశ్చార్జ్  అయిన వారు 952, మరణించిన వారు 34 మంది ఉండగా.. యాదాద్రి, వనపర్తి, వరంగల్ లో ఇప్పటి వరకు కరోనా కేసులు నమోదు కాలేదని అధికారులు చెబుతున్నారు.