కరోనా తగ్గినా గుండెకు ముప్పు

కరోనా తగ్గినా గుండెకు ముప్పు

బీజింగ్: కరోనా మహమ్మారి బారి నుంచి ప్రస్తుతం తప్పించుకున్న పేషెంట్లు.. దాని ఎఫెక్ట్ నుంచి మాత్రం అంత త్వరగా తప్పించుకోలేరని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ (ఎన్ హెచ్ సీ) వెల్లడించింది. ఈ వైరస్ వల్ల సీరియస్ కండిషన్ లోకి వెళ్లి, కోలుకున్న పేషెంట్లకు భవిష్యత్తులో గుండె, ఊపిరితిత్తుల వంటి అవయవాలు దెబ్బతినే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది. ముఖ్యంగా గుండె కండరాలకు వెళ్లే రక్తంలో ఆక్సిజన్ లోపించడం వల్ల ఛాతీ నొప్పి (యాంజినా), గుండె లయ తప్పడం (అరిథ్మియా) వంటి సమస్యలు రావొచ్చని పేర్కొంది. మజిల్ లాస్ తో పాటు చేతులు, కాళ్ల పనితీరు మందగించొచ్చని, డిప్రెషన్, నిద్రలేమి, అతిగా తినడం వంటి డిజార్డర్లూ రావొచ్చని తెలిపింది. సివియర్ సింప్టమ్స్ వచ్చి, కోలుకున్న పేషెంట్లకు భవిష్యత్తులో అవయవాలు దెబ్బతినే ముప్పు ఉందని పలు స్టడీల్లో తేలిందని, అందుకే వారికి దీర్ఘకాలికంగా రిహాబిలిటేషన్ అవసరమని వెల్లడించింది. ఇలాంటి వారికి హాస్పిటల్ ఖర్చులు భారం కాకుండా ఉండటం కోసం ప్రభుత్వాలు లాంగ్ టర్మ్  మెడికల్ ఇన్సూరెన్స్ కవరేజ్ కల్పించాలని సూచించింది. స్వల్ప, మధ్యస్థాయి లక్షణాలతో కరోనా నుంచి కోలుకున్న వారి హెల్త్ పై మాత్రం భవిష్యత్తులో పెద్దగా ఎఫెక్ట్ ఉండదని ఎన్ హెచ్ సీ తెలిపింది.

బీజింగ్ లో మాస్కులు అవసరంలే..

చైనా రాజధాని బీజింగ్ సిటీలో బహిరంగ ప్రదేశాల్లోనూ మాస్కులు పెట్టుకోవడం తప్పనిసరి కాదని ఆదివారం ‘బీజింగ్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్’ తాజా  గైడ్ లైన్స్ జారీ చేసింది. సిటీలో కరోనా పూర్తిగా కంట్రోల్ అయిందని, ప్రజలెవరూ మాస్కులు పెట్టుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. అయితే ఇతరులతో దూరం మాత్రం పాటించాలని సూచించింది.  వాతావరణం బాగున్నప్పుడు బయటికి వచ్చి వ్యాయామాలు కూడా చేసుకోవచ్చని తెలిపింది. ఆదివారం చైనాలో కొత్తగా 17 కేసులు నమోదయ్యాయని ఎన్ హెచ్ సీ వెల్లడించింది. వీరిలో 12 మందికి ఎలాంటి లక్షణాలు లేవని తెలిపింది.

 

ముందు బ్యాక్ లాగ్..ఆ తర్వాతే రెగ్యులర్