రిపోర్ట్ అవుతున్నదాన్నికంటే కేసులు పెరగవు: వి.కె.సారస్వత్

రిపోర్ట్ అవుతున్నదాన్నికంటే కేసులు పెరగవు: వి.కె.సారస్వత్

బెంగళూరు: కరోనా కేసుల సంఖ్య ఇప్పుడు రోజూ రిపోర్ట్ అవుతున్నదానికంటే ఎక్కువ పెరగవని ప్రముఖ సైంటిస్ట్, నీతి ఆయోగ్ మెంబర్ వి.కె.సారస్వత్ సోమవారం అన్నారు. టెస్టులు పెంచడం వల్లే గత నాలుగైదు రోజుల నుంచి కేసుల సంఖ్య పెరిగిందని చెప్పారు. “ఇది మంచి పరిణామం. కరోనా లక్షణాలు లేవని దాక్కున్నవారు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నారు. ఢిల్లీలోని నిజాముద్దీన్ లో మత ప్రార్థనలకు వెళ్లి వచ్చినవారి వల్లే వివిధ ప్రాంతాల్లో కేసులు పెరిగాయి. ఇతర దేశాలతో పోలిస్తే మనం బెటర్. ఇప్పుడు రోజుకు 700 నుంచి 800 కేసులు నమోదవుతున్నాయి. ఇంతకు మించి కేసుల సంఖ్య పెరగదు” అని అన్నారు. దేశవ్యాప్తంగా అమలు చేసిన లాక్ డౌన్ ఫలితాన్ని ఇస్తోందని చెప్పారు. గడిచిన 15, 20 ఏళ్లుగా మన గేశంపై చికన్ గున్యా, డెంగీ లాంటి వైరస్ లు దాడి చేస్తూనే ఉన్నాయని, వాటికి ముందస్తుగానే వ్యాక్సిన్ కనిపెట్టేందుకు రీసెర్చ్ జరగాల్సిన అవసరం ఉందన్నారు.