క‌రోనా ఎఫెక్ట్: ఆదివారం నుండి బేగంబ‌జార్‌లోని దుకాణాలు బంద్‌

క‌రోనా ఎఫెక్ట్: ఆదివారం నుండి బేగంబ‌జార్‌లోని దుకాణాలు బంద్‌

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గ్రేటర్ పరిధిలో పలు మార్కెట్లు లాక్ డౌన్ ప్ర‌కటించాయి. ఇప్ప‌టికే ఈ గురువారం నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు సికింద్రాబాద్ జనరల్ బజార్ మూసివేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించిన‌ సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ నెల 28వ తేదీ నుండి బేగంబజార్ ను కూడా మూసివేయాలని హైద్రాబాద్ కిరాణ వ్యాపారుల అసోసియేషన్ నిర్ణయం తీసుకొంది. ఆదివారం నుంచి 8 రోజులపాటు బేగంబజార్ లోని దుకాణాలను బంద్ చేస్తున్నట్లు కిరణా మర్చంట్ అసోసియేషన్ ప్రకటించింది.

దుకాణాల వద్ద రద్దీని తగ్గించేందుకు ఆదివారం నుంచి మరి కొన్ని మార్కెట్లు బంద్ చేసేందుకు నిర్ణయం తీసుకుంటున్నామ‌ని అసోసియేషన్ తెలిపింది. హైద్రాబాద్, సికింద్రాబాద్ పరిధిలో కరోనా కేసులు ఎక్కువగా నమోదు కావడంపై ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు అసోసియేషన్ పేర్కొంది.