ఏడాది ముగిసేలోగా పెద్దలందరికీ వ్యాక్సిన్

V6 Velugu Posted on May 22, 2021

న్యూఢిల్లీ: ఈ ఏడాది ముగిసేలోపు దేశంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా అందిస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ అన్నారు. టీకా ప్రక్రియను వేగవంతం చేసేలా వ్యాక్సిన్ తయారీదారులను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. మరికొన్ని వారాల్లో దేశంలో టీకా ఉత్పత్తి వేగవంతం అవుతుందని, తద్వారా వ్యాక్సిన్ కొరత తీరుతుందని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. జూలై నెలాఖరుకు 51 కోట్ల వ్యాక్సిన్ డోసుల సేకరణ పూర్తవుతుందని.. ఆగస్ట్ నుంచి డిసెంబర్ మధ్యలో 216 కోట్ల డోసులు అందుబాటులో ఉంటాయని భావిస్తున్నట్లు చెప్పారు. 

Tagged India, Vaccination, Central minister harsha vardhan, adults, vaccine production, Vaccine Manufacturers

Latest Videos

Subscribe Now

More News