
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 9,283 కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. కొవిడ్ బారిన పడి మరో 437 మంది బలయ్యారు. మంగళవారం ఒక్కరోజే 10,949 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 1,11,481గా ఉన్నాయి. గత 537 రోజుల్లో నమోదైన యాక్టివ్ కేసుల్లో ఇదే అత్యల్పమని చెప్పొచ్చు. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. స్పెషల్ డ్రైవ్ లతో అందరికీ టీకా వేసే కార్యక్రమాన్ని కేంద్ర సర్కార్ వేగవంతం చేస్తోంది.