ఇదేం కక్కుర్తి.. ఒకే రోజులో 10 డోసుల వ్యాక్సిన్ !

ఇదేం కక్కుర్తి..  ఒకే రోజులో 10 డోసుల వ్యాక్సిన్ !

కరోనా మహమ్మారి మనల్ని ఇంకా వదల్లేదు. ఇక కొత్త కొత్త వేరియంట్స్ తో దాడి చేస్తూనే ఉంది. సెకండ్ వేవ్ తగ్గిందనుకుంటే.. ఇప్పుడు థర్డ్ వేవ్ భయం జనల్ని భయపెడుతోంది. దీనికి తోడు ఒమిక్రాన్ కూడా పలు దేశాల్లో ఇప్పటికే వ్యాపించింది. ఈ క్రమంలో వ్యాక్సిన్ వేసుకోని వారు సైతం ఇప్పుడు థర్డ్ వేవ్ భయంతో కరోనా వ్యాక్సిన్ సెంటర్లకు క్యూ కడుతున్నారు. అయితే కొందరు  మాత్రం వ్యాక్సిన్ తీసుకోవడానికి ఇంకా భయపడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి మాత్రం అందరికీ షాక్ ఇచ్చాడు. కరోనా వైరస్ భయంతో ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా పది డోసుల వ్యాక్సిన్ ఒకేరోజులో తీసుకున్నాడు. ఈ ఘటన న్యూజిలాండ్ లో చోటు చేసుకుంది.

న్యూజిలాండ్‌కు చెందిన ఒక వ్యక్తి కేవలం 24 గంటల్లో 10 వ్యాక్సిన్‌లు తీసుకున్నట్లు తెలిసింది. దీంతో ఇది నిజమా కాదా అన్న ఉద్దేశంతో న్యూజిలాండ్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ దీనిపై దర్యాప్తు చేసింది. అయితే సదరు వ్యక్తి వేర్వేరు వ్యక్తుల పేర్ల మీద వ్యాక్సిన్‌ సెంటర్లన్నిటింకి వెళ్లి మరీ వేయించుకున్నాడని విచారణలో తెలుస్తుంది. దీంతో ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వశాఖకు సంబంధించిన కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేనేజర్‌ ఆస్ట్రిడ్ కూర్నీఫ్ ఆ వ్యక్తి ఆరోగ్యం గురించి ఆందోళనకు గురై సదరు వ్యక్తిని తక్షణమే వైద్యుడుని సంప్రదించవల్సిందిగా సూచించారు. 

అయితే హెల్త్‌ రికార్డు ప్రకారం ఎవరి హెల్త్‌ రికార్డు ప్రకారం వారు వేయించకోవాలి. ఇలా మరోకరి గుర్తింపు రికార్డుతో వేయించుకోవడం చాల ప్రమాదం అంటూ న్యూజిలాండ్‌ మంత్రిత్వ శాఖ ప్రతినిధి హెలెన్‌ ప్రజలను హెచ్చరించారు. అతనికి ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేకపోయినా.. అతని ఆరోగ్యంపై మాత్రం వైద్యుల పర్యవేక్షణ ఉండాలని అక్కడి అధికారులు సూచించారు