క‌రోనా బాధితుల‌కు దీర్ఘ‌కాలిక స‌మ‌స్య‌లు..గుర్తించిన సైంటిస్ట్ లు

క‌రోనా బాధితుల‌కు దీర్ఘ‌కాలిక స‌మ‌స్య‌లు..గుర్తించిన సైంటిస్ట్ లు

క‌రోనా సోకిన బాధితులు దీర్ఘ‌కాలిక స‌మ‌స్య‌లు త‌లెత్తుతున్న‌ట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియాలోని ముర్డోక్ యూనివ‌ర్సిటీ సైంటిస్ట్ లు, యూకేలోని కేంబ్రిడ్జ్ యూనివ‌ర్సిటీ సంయుక్త ప‌రిశోధ‌న‌ల్లో క‌రోనా సోకిన వ్య‌క్తుల జీవ‌క్రియ పై క‌రోనా తీవ్రంగా ప్ర‌భావం చూపుతున్న‌ట్లు గుర్తించారు.

ఆరోగ్యంగా ఉన్న వ్య‌క్తుల‌కు, క‌రోనా సోకి త‌గ్గిన వారి ఆరోగ్యం ఎలా ఉంటుంద‌ని అనే అంశంపై ప‌రిశోధ‌న‌లు చేయ‌గా..ప‌రిశోధ‌న‌ల్లో వైర‌స్ సోకిన వారికి దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతున్న‌ట్లు క‌నిపెట్టారు.

ముఖ్యంగా క‌రోనా సోకి త‌గ్గుముఖం ప‌ట్టిన వారిలో లివ‌ర్ ప‌నిచేయ‌క‌పోవ‌డం, డైస్లిపిడెమియా, డయాబెటిస్, కొరోనరీ, గుండెసంబంధిత స‌మ‌స్య‌లు త‌లెత్తుతున్న‌ట్లు సైంటిస్ట్ లు తెలిపారు. ఇవన్నీ క‌రోనా వైరస్ బారిన పడిన రోగులలో దీర్ఘకాలిక ప్రభావాలకు సంబంధించినవిగా గుర్తించబడ్డాయి. స‌మ‌యం సంద‌ర్భం లేకుండా శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు త‌లెత్తుతున్న‌ట్లు తేలింది.

క‌రోనా సోకిన వాళ్ల‌కి ప‌నితీరు సంబంధంలేకుండా మ‌ధుమేహం, ఊపిరి తిత్తులు దెబ్బ‌తినే సంకేతాలున్న‌ట్లు ముర్డోక్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ జెరెమీ నికల్సన్ చెప్పారు.