అబ్రాడ్ స్టడీపై కరోనా ఎఫెక్ట్.. 48శాతం మంది మనోళ్లపై ప్రభావం

అబ్రాడ్ స్టడీపై కరోనా ఎఫెక్ట్.. 48శాతం మంది మనోళ్లపై ప్రభావం

 క్యూఎస్ రిపోర్టులో వెల్లడి

న్యూఢిల్లీ: విదేశీ విద్యపై కరోనా ఎఫెక్ట్ ఉంటుందని క్వాక్వరెల్లి సిమండ్స్ (క్యూఎస్) సంస్థ పేర్కొంది. ఫారిన్ లో హయ్యర్ ఎడ్యుకేషన్ చేయాలని ప్లాన్ చేసుకున్న 48శాతం మంది ఇండియన్ స్టూడెంట్ల నిర్ణయాన్ని ఇది ప్రభావితం చేసిందని వెల్లడించింది. ‘‘ఇండియన్ స్టూడెంట్స్ మొబిలిటీ రిపోర్టు 2020: ఇంపాక్ట్ ఆఫ్ కొవిడ్ 19 ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ చాయిసెస్” పేరుతో రిపోర్టును విడుదల చేసింది. లండన్ కేంద్రంగా పనిచేసే క్యూఎస్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా యూనివర్సిటీలు, కాలేజీలకు ర్యాంకింగ్స్ ఇస్తుంటుంది. ఇప్పటికే కాస్ట్లీగా మారిన ఇంటర్నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ రంగంలో పెట్టుబడులకు తగిన ఫలితాలు రాకపోవడం, కరోనా తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఉపాధి అవకాశాలు తగ్గిపోవడం లాంటివి ఇందులో కీలక పాత్ర పోషిస్తాయని క్యూఎస్ ఎక్స్ పర్ట్స్ పేర్కొన్నారు. ‘‘అబ్రాడ్ లో హయ్యర్ ఎడ్యుకేషన్ చేయాలని ఈమధ్య నిర్ణయించుకున్న 48.46 శాతం మంది స్టూడెంట్ల డెసిషన్​పై కరోనా ప్రభావం చూపింది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ (స్టెమ్) స్టూడెంట్స్ తో పోలిస్తే నాన్ స్టెమ్ స్టూడెంట్స్ లో ఎక్కువ మంది అబ్రాడ్ స్టడీపై మరోసారి ఆలోచనలో పడ్డారు. కరోనా తర్వాత స్టెమ్ బేస్డ్ స్టూడెంట్లకు డిమాండ్ ఉండే అవకాశం ఉంది. కానీ నాన్ స్టెమ్ స్టూడెంట్లకు అంతగా చాన్సెస్ ఉండకపోవచ్చు. ఈ కారణంగానే వారు హయ్యర్ ఎడ్యుకేషన్ ప్లాన్స్ పై పునరాలోచిస్తున్నారు” అని రిపోర్టులో వెల్లడైంది. కరోనా తర్వాత అన్ని లెవల్స్ లోనూ టీచింగ్, లెర్నింగ్ పద్ధతుల్లో మార్పులు వస్తాయని తెలిపింది. స్టడీ కోసం స్టూడెంట్లు దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలకు వెళ్లడంపైనా కూడా కరోనా ప్రభావం చూపుతుందని పేర్కొంది.

Covid-19 pandemic to impact study abroad plans of nearly 48 percent Indian students: QS Reports
Delhi Police at Delhi University’s prestigious Ramjas College today almost turned into a battle ground with students on Wednesday. Express Photo by Amit Mehra. 15.01.2020. *** Local Caption *** Delhi Police at Delhi University’s prestigious Ramjas College today almost turned into a battle ground with students