వ్యాక్సినేషన్ డ్రైవ్‌‌కు ఏడాదికి పైగా టైమ్

వ్యాక్సినేషన్ డ్రైవ్‌‌కు ఏడాదికి పైగా టైమ్

న్యూఢిల్లీ: దేశంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ పూర్తవ్వడానికి ఏడాది లేదా అంతకంటే ఎక్కువ సమయం పడుతుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ‘వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఐదు ముఖ్యమైన అంశాలు ఇమిడి ఉన్నాయి. ఇదంతా పూర్తవ్వడానికి ఏడాదికి పైగా సమయం పడుతుంది. తొలుత ప్రజలను వ్యాక్సినేషన్‌‌ డ్రైవ్‌‌లో పార్టిసిపేట్ అయ్యేలా చేయాలి. రెండోది ఎన్నికలను నిర్వహించిన అనుభవాన్ని వాడుకోవాలి. బూత్ స్ట్రాటజీ ఎక్స్‌‌పీరియన్స్‌‌ను సరిగ్గా వినియోగించుకోవాలి. మూడోది ప్రైమరీ హెల్త్ కేర్ లాంటి సర్వీసులను ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగించాలి. నాలుగోది సైంటిఫిక్, రెగ్యులేటరీ నిబంధనలను తప్పకుండా పాటించేలా చూడాలి. ఇక ఐదో అంశం టెక్నాలజీని ఉపయోగించుకుంటూ టీకా అమలు ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలి’ అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సెక్రెటరీ రాజేశ్ భూషణ్ పేర్కొన్నారు.