
విదేశాలకు వెళ్లే వారికి కరోనా వ్యాక్సిన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఒలింపిక్స్ ప్లేయర్స్, విద్య, ఉపాధి కోసం విదేశాలకు వెళ్లే వారు తమ పాస్‌పోర్టుతో పాటు కరోనా టీకా సర్టిఫికెట్లు తప్పనిసరిగా లింక్ చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఇతర సర్టిఫికెట్లు చూపించాల్సిన అవసరం లేదని ప్రకటించింది. అంతేకాదు వీరిలో ఇప్పటికే ఫస్ట్ డోసు తీసుకున్నవారు 28 రోజుల తర్వాత కొవిషీల్డ్ రెండో డోసు తీసుకునేందుకు అనుమతించింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు తగిన ఏర్పాట్లు చేయాలని కేంద్రం ఆదేశించింది.