ఈ ఏడాదిలో 35 శాతం వ్యాక్సినేషన్ కూడా కష్టమే

ఈ ఏడాదిలో 35 శాతం వ్యాక్సినేషన్ కూడా కష్టమే

న్యూఢిల్లీ: కరోనా బారి నుంచి తప్పించుకునేందుకు వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని వైద్య నిపుణులు చెబుతున్నారు. కానీ దేశంలో టీకా ప్రక్రియ పూర్తవ్వడానికి చాలా సమయం పట్టేలా ఉంది. తాజాగా ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ (ఐఎంఎఫ్) విడుదల చేసిన రిపోర్టు కూడా దీనికి ఊతం ఇస్తోంది. ఈ ఏడాది ముగిసేసరికి భారత్ లో 35 శాతం వ్యాక్సినేషన్ చేయడం కూడా కష్టమేనని ఐఎంఎఫ్ ఎకనామిస్ట్ రుచిర్ గోపాల్, చీఫ్ ఎకనామిస్ట్ గీతా గోపీనాథ్ తెలిపారు. కరోనా బారి నుంచి బయటపడాలంటే భారత్ వెంటనే భారీగా టీకా ఉత్పత్తికి ఆర్డర్ ఇవ్వాలని గీతా గోపీనాథ్ సూచించారు. దీంతోపాటు దేశీయంగా వ్యాక్సిన్ ల తయారీని వేగవంతం చేసేందుకు అవసరమైన ముడిసరుకులను త్వరగా సమకూర్చుకోవాలని పేర్కొన్నారు.