వ్యాక్సిన్ వల్ల వంధత్వం రాదు.. పుకార్లను నమ్మకండి

వ్యాక్సిన్ వల్ల వంధత్వం రాదు.. పుకార్లను నమ్మకండి

న్యూఢిల్లీ: వ్యాక్సినేషన్ డ్రైవ్‌‌పై వస్తున్న పుకార్లు, ఊహాగానాలపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్దన్ స్పందించారు. కరోనా టీకా వేయించుకున్న తర్వాత కొందరికి ఇబ్బందులు తలెత్తొచ్చునని, తేలికపాటి సైడ్ ఎఫెక్ట్స్ రావొచ్చునని తెలిపారు. వ్యాక్సిన్ తీసుకున్నాక తేలికపాటి జ్వరం, ఒళ్లు నొప్పులు రావడం సహజమేనన్నారు. అయితే అవి స్వల్ప వ్యవధిలోనే తగ్గిపోతాయన్నారు.

సైడ్ ఎఫెక్ట్స్ తాత్కాలికమేనని.. తక్కువ టైమ్‌‌లో తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటారని హర్ష వర్దన్ స్పష్టం చేశారు. అలాగే టీకా వేయించుకున్నాక జ్వరం వస్తే కరోనా సోకిందని పొరపాటు పడొద్దని, తేలికపాటి సైడ్ ఎఫెక్ట్స్‌లో భాగంగా ఇలాంటివి వచ్చే చాన్స్ ఉందని తెలిపారు. ‘కరోనా వ్యాక్సిన్ వల్ల పురుషులు లేదా మహిళల్లో వంధత్వం వస్తుందనడంలో ఎలాంటి శాస్త్రీయత లేదు. ఇలాంటి అసత్య వార్తలు, సమాచారాన్ని నమ్మకండి’ అని ప్రజలను హర్ష వర్దన్ కోరారు.