కరోనా వైరస్ మరణాల్లో రెండో ప్లేస్ లోకి వచ్చింది బ్రిటన్. ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్ ను దాటింది. ఇప్పటికే అక్కడ మరణాల సంఖ్య 30 వేలు దాటింది. కానీ, ఆ దేశ ప్రభుత్వం మాత్రం ఇండియన్లు, బంగ్లాదేశీలు, పాకిస్తానీలు, నల్లజాతీయుల్లోనే మరణాల రేటు ఎక్కువని వాదిస్తోంది. తెల్లోళ్ల తో పోలిస్తే వీళ్లే ఎక్కువ చనిపోతారంటోంది. దేశంలో మార్చి 2 నుంచి ఏప్రిల్10 మధ్య చనిపోయినోళ్ల వివరాలపై బ్రిటన్‌కు చెందిన ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ (ఓఎన్ఎస్) నివేదిక విడుదల చేసింది. ఈ టైంలో 483 మంది ఇండియన్లు వైరస్ కు బలయ్యా రని ఆ రిపోర్ట్ లో పేర్కొంది. అందులో 401 మంది 65 ఏళ్లు పైబడినోళ్లేనని వెల్లడించింది.
సామాజిక ఆర్థిక పరిస్థితుల వల్లే మరణాల విషయంలో ఇండియాతో పోలిస్తే పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లు ఎక్కువగా చనిపోతున్నారని ఓఎన్ఎస్ రిపోర్ట్ లో పేర్కొంది. తెల్లోళ్ల తో పోలిస్తే పాక్ , బంగ్లాదేశ్ కు చెందిన మగవాళ్ల మరణాల రేటు 1.8 రెట్లు ఎక్కువని చెప్పింది. అదే మహిళల విషయానికి వస్తే 1.6 రెట్లు ఎక్కువంది. వయసు పరంగా చూసినా మగవాళ్లు4.2 రెట్లు , మహిళలు 4.3 రెట్లు ఎక్కువగా మరణిస్తున్నట్టు తెలిపింది. దీనికి కారణం వాళ్లసామాజిక జీవనం, ఆర్ధిక పరిస్థితులేనని రిపోర్టులో పేర్కొంది. డెత్ సర్టిఫికెట్లలో చనిపోయిన వాళ్ల ఎత్నిసిటీ (జాతి)ని కూడా చేర్చాలన్న డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యం లోనే ఓఎన్ఎస్ ఈ స్టడీ చేసింది.
