ఏపీలో ఒక్కరోజే 14వేలు దాటిన కేసులు

ఏపీలో ఒక్కరోజే  14వేలు దాటిన కేసులు

అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరగడమే తప్ప తగ్గడం లేదు. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 46 వేల 650 మందికి పరీక్షలు చేయగా 14 వేల 440 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. కరోనా సోకి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో నలుగురు మరణించారు. తూర్పుగోదావరి, గుంటూరు, ప్రకాశం, విశాఖపట్టణం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయినట్లు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. 
మరోవైపు కరోనా సోకిన వారిలో 3,969 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఇళ్లకు వెళ్లిపోయినట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. రాష్ట్రంలో కరోనా విజృంభణను జిల్లాల వారీగా పరిశీలిస్తే విశాఖపట్టణం జిల్లాలో ఇవాళ కూడా అత్యధిక కేసులు నమోదయ్యాయి.  రాష్ట్రంలో గరిష్టంగా విశాఖ జిల్లాలో 2258 కేసులు, ఆ తర్వాత అనంతపురం జిల్లాలో 1534 కేసులు, ప్రకాశం జిల్లాలో 1399 కేసులు, కర్నూలు జిల్లాలో 1238 కేసులు చొప్పున నమోదయ్యాయి.  గడచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల వివరాలు కింది పట్టికలో చూడండి.

 

ఇవి కూడా చదవండి

ఢిల్లీలో కరోనా కలకలం.. తాజాగా ఎన్ని కేసులంటే

ఐసీసీ టీ20 బెస్ట్ ప్లేయర్గా పాక్ ఆటగాడు

సయ్యద్ మోదీ టోర్నీలో పీవీ సింధు విజయం