
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి అంశంపై చర్చించేందుకు ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ మీటింగ్ నిర్వహించనున్నారు. ఒమిక్రాన్ వ్యాప్తితో కేసులు పెరుగుతుండటంతో తీసుకోవాల్సిన చర్యలపై గురువారం చర్చించనున్నారు. ఆదివారం హై లెవెల్ మీటింగ్ నిర్వహించిన ప్రధాని.. జిల్లా స్థాయిల్లో హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను సిద్ధంగా ఉంచాలని సూచించారు. మిషన్ మోడ్‌లో వ్యాక్సినేషన్‌ను కొనసాగించాలని కోరారు.
డాక్టర్లతో కేంద్ర మంత్రి వర్చువల్ టాక్
కరోనా పరిస్థితిపై దేశవ్యాప్తంగా ఉన్న స్పెషలిస్టు డాక్టర్లతో కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ చర్చించారు. వర్చువల్‌గా డాక్టర్లతో సమావేశమైన ఆయన.. వారి నుంచి సలహాలు స్వీకరించారు. 120 మంది ఎక్స్‌పర్ట్ డాక్టర్లతో చర్చించినట్లు మాండవీయ ట్వీట్ చేశారు. కరోనాపై అందరం కలిసి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.