తెలంగాణలో 459 కరోనా కేసులు

తెలంగాణలో 459 కరోనా కేసులు

భారతదేశంలో కరోనా కేసులు ఇంకా నమోదవుతూనే ఉన్నాయి. భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో.. కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. పెరుగుతున్న రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. కరోనా నిబంధనలు పాటించాలని చెబుతోంది. గత 24 గంటల్లో 11,793 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక 24గంటల్లో 27మంది మరణించగా..9486 మంది మహమ్మారి నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. తెలంగాణలో 24 గంటల్లో 459 కేసులు రికార్డు అయినట్లు ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.

247 మంది ఆరోగ్యవంతులయ్యారని.. ఇప్పటి వరకు కరోనా వైరస్ నుంచి 7, 91, 708 మంది కోలుకున్నారని పేర్కొంది. గత 24 గంటల్లో కరోనా నుంచి ఎవరూ చనిపోలేదని, మరణాల సంఖ్య 4 వేల 111గా ఉందని తెలిపింది. రికవరీ రేటు 98.96 శాతంగా ఉందని, మొత్తం 26 వేల 126 టెస్టులు నిర్వహించడం జరిగిందని వెల్లడించింది. హైదరాబాద్ లోనే 232 కేసులు నమోదయ్యాయి. అలాగే.. రంగారెడ్డిలో 60, సంగారెడ్డిలో 54, మల్కాజ్ గిరిలో 28 కేసులు రికార్డయ్యాయని పేర్కొంది.